టీఎస్‌ ఆర్టీసీలో మూడు ముక్కలాట.. కేసీఆర్ కీలక నిర్ణయం?

టీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునేందుకు గులాబీ బాస్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి అరకొరగానే ఉన్నాయి. దీంతో నవంబర్ 2న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. టీఎస్ఆర్టీసీని మూడు ముక్కలుగా విభజించి.. 50 శాతం […]

టీఎస్‌ ఆర్టీసీలో మూడు ముక్కలాట.. కేసీఆర్ కీలక నిర్ణయం?
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2019 | 6:12 AM

టీఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునేందుకు గులాబీ బాస్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి అరకొరగానే ఉన్నాయి. దీంతో నవంబర్ 2న సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ అంశమే ప్రధాన ఎజెండాగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. టీఎస్ఆర్టీసీని మూడు ముక్కలుగా విభజించి.. 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేటీకరణ చేయాలని సర్కార్ యోచిస్తోంది. ఇక ఈ భేటీలోనే అద్దె, ప్రైవేట్ బస్సులకు స్టేజి కేరియర్లకు అనుమతులు ఇస్తారని వినికిడి. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 27 రోజులు గడుస్తున్నా.. వారు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. విలీనం విషయంలో ఇరు వర్గాలు మెట్టు దిగకపోవడంతో హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కోర్టులో కూడా ఈ సమస్య ఎటూ తేలకపోగా.. అటు ప్రజలు మాత్రం ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇవాళ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. ఇప్పటికైనా కోర్టు ఖచ్చితమైన తీర్పు ఇస్తుందో లేదో వేచి చూడాలి.?