Ambedkar Statue Inauguration Highlights: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

| Edited By: Ravi Kiran

Apr 14, 2023 | 6:12 PM

Ambedkar Statue in Hyderabad Unveiling Highlights: దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్ అంబేడ్కర్‌ హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం..తెలంగాణకే మణిహారంగా నిలిచింది

Ambedkar Statue Inauguration Highlights: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..
Ambedkar Statue, Cm Kcr

Ambedkar Statue in Hyderabad Unveiling Live Updates: దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహవిష్కరణకు హైదరాబాద్‌ నగరం ముస్తాబైంది. పండగ వాతావరణంలో రాజ్యంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అండేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాల నుంచి బీఆర్‌ఎస్‌ నేతలు భారీగా తరలిరానున్నారు. అలాగే సుమారు 50 వేల మంది ప్రజలు తరలివచ్చేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్‌. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా నగరంలోని నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. మరి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అట్టహాసంగా జరుగుతోన్న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ అప్డేట్స్‌ మీకోసం..

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Apr 2023 05:09 PM (IST)

    తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం..- సీఎం కేసీఆర్

    తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం.. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. అంబేడ్కర్‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని అన్నారు సీఎం కేసీఆర్‌. అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందన్నారు. అవార్డు కోసం రూ.51 కోట్ల నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏటా అంబేడ్కర్‌ జయంతి రోజున అవార్డు ప్రదానం చేశారని.. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు అని.. వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

  • 14 Apr 2023 05:06 PM (IST)

    ఇది విగ్రహం కాదు.. విప్లవం.. – సీఎం కేసీఆర్

    అంబేడ్కర్‌ విశ్వ మానవుడు.. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం అని అన్నారు సీఎం కేసీఆర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు దాటిందని.. ఎవరో అడిగితే అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదన్నారు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం.. సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నామన్నారు. ఇక్కడికి దగ్గరలోనే అమరవీరుల స్మారకం ఉందన్నారు కేసీఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం ఉంది.. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు స్మరణకు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు కేసీఆర్‌. ఇది విగ్రహం కాదు.. విప్లవం.. అని అన్నారు కేసీఆర్.

  • 14 Apr 2023 05:04 PM (IST)

    అంబేడ్కర్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు..- సీఎం కేసీఆర్‌

    తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం అని అన్నారు సీఎం కేసీఆర్‌. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. అంబేడ్కర్‌ పేరిట అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారని.. అంబేడ్కర్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వబోతోందన్నారు సీఎం కేసీఆర్‌.

  • 14 Apr 2023 04:39 PM (IST)

    కేసీఆర్ కొత్త శకానికి నాందిపలికారు – ప్రకాష్ అంబేద్కర్‌

    తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షులు తెలిపారు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో కేసీఆర్ కొత్త శకానికి నాందిపలికారు. సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ అహర్నిశలు తప్పించారు. అంబేద్కర్ ఆశయాలను సాధించమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు ప్రకాష్ అంబేద్కర్‌.

  • 14 Apr 2023 04:34 PM (IST)

    దేశ చరిత్ర పుటల్లో నిలిచిన రోజు ఇది…- మంత్రి కొప్పుల ఈశ్వర్

    దేశ చరిత్ర పుటల్లో నిలిచిన రోజు ఇది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలో ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామన్నారు కొప్పుల ఈశ్వర్‌. అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నామన్నారు. అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కేసీఆర్‌ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణమన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో దళితబంధు ఆదర్శంగా అమలవుతోందన్నారు కొప్పుల ఈశ్వర్.

  • 14 Apr 2023 03:47 PM (IST)

    హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం

    భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం..తెలంగాణకే మణిహారంగా నిలిచింది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం..మరోవైపు అమరవీరుల స్మారకం..ఆ పక్కనే అంబేద్కర్‌ భారీ విగ్రహం..ఎన్టీఆర్ గార్డెన్, జలవిహార్, లుంబినీ పార్క్, హుస్సేన్‌సాగర్‌, బిర్లా మందిరం..హైదరాబాద్ మహానగరానికే మణిహారంగా నిలిచాయి.

  • 14 Apr 2023 03:38 PM (IST)

    అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

    నవ భారత నిర్మాత బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల.. మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్ అంబేడ్కర్‌ హాజరయ్యారు.

  • 14 Apr 2023 03:35 PM (IST)

    అంబేద్కర్‌ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం..

    అంబేద్కర్‌ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. 125 అడుగుల విగ్రహాన్నిమరికాసేపట్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్ హాజరయ్యారు. కేసీఆర్‌తో కలిసి వేదిక దగ్గరకు చేరుకున్నారు ప్రకాష్‌. ఆయనతోపాటు బౌద్ద సన్యాసులు హజరయ్యారు. ఇప్పటికే వేదిక వద్దకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారు. ర్యాలీగా చేరుకుంటున్నారు జనం.

  • 14 Apr 2023 03:32 PM (IST)

    అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు చేరుకున్న సీఎం కేసీఆర్..

    అంబేద్కర్‌ విగ్రహం దగ్గరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. 125 అడుగుల విగ్రహాన్నిమరికాసేపట్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్ హాజరయ్యారు. కేసీఆర్‌తో కలిసి వేదిక దగ్గరకు చేరుకున్నారు ప్రకాష్‌. ఇప్పటికే వేదిక వద్దకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు వచ్చారు. ర్యాలీగా చేరుకుంటున్నారు జనం. ట్యాంక్‌బండ్ దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    లైవ్ వీడియో కోసం ఇక్కడ చూడండి…

  • 14 Apr 2023 03:17 PM (IST)

    హైదరాబాద్‌లో అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు..

    అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆవిష్కృతమౌతోన్న అంబేడ్కర్‌ భారీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో హైదరాబాద్‌లో అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లక్డీకపూల్, ఖైరతాబాద్, రవీంద్ర భారతి సిగ్నల్స్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐమాక్స్, నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు.

    లైవ్ కోసం ఇక్కడ చూడండి..

  • 14 Apr 2023 02:47 PM (IST)

    ట్యాంక్‌బండ్‌ దగ్గరకి ర్యాలీగా తరలివస్తున్న జనం..

    ట్యాంక్‌బండ్‌ దగ్గరకి ర్యాలీగా జనం తరలివస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్‌ చేతుల మీదుగా అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ జరగనుంది.

     

     

  • 14 Apr 2023 02:46 PM (IST)

    పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహం..

    హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహాన్నిమంత్రి కేటీఆర్‌ ప్రారంభిచారు. త్వరలో పంజాగుట్ట చౌరస్తాకు అంబేద్కర్ పేరు ఫిక్స్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ఆవిర్భావం అయ్యిందన్నారు. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టిన దమ్ము కేసీఆర్‌దన్నారు. కొత్త పార్లమెంట్‌కి అంబేద్కర్ పేరు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు.

  • 14 Apr 2023 02:44 PM (IST)

    ఆయన భారత్‌లో జన్మించడం మన అదృష్టం..

    మహనీయుడు అంబేద్కర్ భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామ రక్ష అన్నారు.

  • 14 Apr 2023 02:42 PM (IST)

    జమ్మికుంట అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అంబేద్కర్ మనవడు..

    కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు హాజరయ్యారు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, విప్ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, కలెక్టర్‌ కర్ణన్‌ పాల్గొన్నారు.

  • 14 Apr 2023 01:51 PM (IST)

    కోలాహలంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్..

    అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో  కోలాహలం నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.  దారులన్నీ అంబేడ్కర్ విగ్రహం వైపే.   తెలంగాణ లోని అన్ని జిల్లాల నుంచి వేలాది గా తరలివస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దారి పొడవునా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అలాగే ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో.. ఎవరు అస్వస్థత కి గురైనా ఇబ్బంది పడకుండా మెడికల్ క్యాంపు లు ఏర్పాటుచేశారు.

  • 14 Apr 2023 01:43 PM (IST)

    కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మేయర్

    125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా చింతల్ బస్తి ప్రేమ్ నగర్ లో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారామె.  ఈ సందర్భంగా కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పెరిగాయన్నారు.

  • 14 Apr 2023 01:32 PM (IST)

    ట్యాంక్‌ బండ్‌ దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు

    అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌, హుస్సేన్‌ సాగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

  • 14 Apr 2023 01:09 PM (IST)

    పంజాగుట్ట సర్కిల్ కు అంబేడ్కర్ పేరు

    డాక్టర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఆయన విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన మంత్రి కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి కూడా అంబేడ్కర్‌ పేరే పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే స్థానికుల ఆకాంక్ష మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్‌ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు.

  • 14 Apr 2023 12:55 PM (IST)

    అంబేడ్కర్ స్మృతివనం లైవ్ విజువల్స్

  • 14 Apr 2023 12:40 PM (IST)

    కమిట్మెంట్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్‌: తలసాని

     

    అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణపై మంత్రి తలసాని మాట్లాడారు. ‘ఆనాడు సీఎం కెసీఆర్ ఇచ్చిన మాట మేరకు ఈ రోజు విగ్రహం ఏర్పాటు జరిగింది. దేశం గర్వ పడేలా కొత్త సచివాలయం ఏర్పాటైంది. దళితులకు 10 లక్షల దళిత బందు ఇచ్చారు. దేశంలో ఏ రాజకీయ నేత ఇలాంటి గొప్ప ఆలోచనలు చేయలేదు. మాటలు అందరూ చెప్తారు,కానీ ఆచరించిన ఏకైక వ్యక్తి సీఎం కేసిఆర్. కమిట్మెంట్ ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి. 100 అడుగులు పెడతామని అనేక మంది చెప్పారు. ఇప్పటికీ పెట్టలేదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం’ అని  మంత్రి పేర్కొన్నారు.

  • 14 Apr 2023 12:34 PM (IST)

    సీఎం కేసీఆర్ షెడ్యూల్

    • 3 గంటలకు విగ్రహం వద్దకు  సీఎం, అతిథులు చేరుకోనున్నారు.
    • 4:10 నిమిషాలకు బహిరంసభలో సీఎం స్పీచ్ ప్రారంభం కానుంది.
Follow us on