అసలే ఆదివారం. మరోవైపు ఆషాడం. రెండూ కలిసి వచ్చాయి. ఇక బోనాల సందడి ఉండనే ఉంది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో నాన్‌వెజ్ ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు పెరగాయి. చికెన్ కేజీ 250 రూపాయలు, మటన్ ధర కేజీ 720 రూపాయలకు చేరింది. నాన్-వెజ్ ప్రియులు సండే ఎలాగూ చికెన్ ఆర్ మటన్ వండుకుంటారు. ఇక బోనాలు మొక్కులు చెల్లించుకునేవారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చికెన్, గుడ్లు తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో జనాలు నాన్-వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరో రీజన్ ఏంటంటే… గతం వారం, 10 రోజులుగా వాతావరణం చల్లగా మారింది. దీంతో వేడి వేడిగా తినాలని అందరికీ అనిపిస్తోంది. ఇక అందులో నాన్ వెజ్ ప్రియులు ఏ చికెనో, మటనో తెప్పించుకొని లాగించేస్తున్నారు. దీంతో మాంసం ధరలు కొండెక్కాయి.
ఇక కిలో నాటు కోడి ధర రూ.650-700 వరకు పలుకుతోంది. ఇక గుడ్డు ధర కూడా బాగానే పెరిగింది. హోల్‌సేల్ దుకాణాల్లో డజన్ గుడ్లు రూ.58 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కిరాణ దుకాణాల్లో రూ.70కు విక్రయిస్తున్నారు.
Also Read:వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం