Hyderabad: హైదరాబాద్‌కు విప్లవ దివిటి చేగువేరా కూతురు, మనవరాలు.. ఎందుకొచ్చారంటే..?

|

Jan 22, 2023 | 8:53 AM

విప్లవ దివిటి చే కూతురు డాక్టర్ అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్‌ నగరంలో జరిగే సభలో పాల్గొననున్నారు.

Hyderabad: హైదరాబాద్‌కు విప్లవ దివిటి చేగువేరా కూతురు, మనవరాలు.. ఎందుకొచ్చారంటే..?
Aleida Guevara
Follow us on

ప్రపంచ విప్లవ యోధుడు చేగువేరా.. అంటే తెలియనివారంటూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే, విప్లవ దివిటి చే కూతురు డాక్టర్ అలైదా గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువేరా ఆదివారం హైదరాబాద్‌ నగరంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న చే వారసులు.. ఈరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో జరగనున్న క్యూబా సంఘీభావ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. రవీంద్ర భారతిలో క్యూబా సంఘీభావ సభ నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా తెలంగాణ కమిటీ కోఆర్డినేటర్స్ ఎం.బాలమల్లేష్, డీజీ నరసింహారావు శనివారం వెల్లడించారు. ఈ క్యూబా సంఘీభావ సభకు ముఖ్య అతిథిగా చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా, చేగువేరా మనవరాలు ఎస్తేఫానియా గువేరా హాజరవుతారని వెల్లడించారు. కాగా.. ఈ సభలో పలు పార్టీలకు చెందిన నాయకులు కూడా పాల్గొనున్నారు.

ఈ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, తెలంగాణ హైకోర్టు జస్టిస్ రాధా రాణి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ నేత మల్లు రవి, తదితర నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ప్రముఖులు పాల్గొననున్నారు.

కాగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా దేశానికి చాలా దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అందులో భాగంగా క్యూబాకు మద్దతు తెలుపుతూ హైదరాబాద్‌లో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..