R Krishnaiah: బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు.. కోర్టు ఆదేశాలతో..

|

Jun 03, 2022 | 6:50 PM

తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

R Krishnaiah: బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు.. కోర్టు ఆదేశాలతో..
Bc Leader R. Krishnaiah
Follow us on

BC Leader R. Krishnaiah: బీసీ సంఘం నేత, తాజాగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేష‌న్ వేసిన ఆర్. కృష్ణయ్యపై హైదారబాద్‌లో కేసు న‌మోదైంది. భూ వ్యవహారంలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని ఆక్రమించుకునేందుకు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

దీనిపై విచారించిన కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్యపై 506, 447, 427, 506, 384 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్.కృష్ణయ్యతో తనకు 40 ఏళ్లుగా స్నేహం ఉందని.. తన భూమిని కబ్జా చేసి చంపాలని చూశారని రవీందర్‌రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు ఆర్ కృష్ణయ్యతోపాటు.. మరికొందరిపై కేసు నమోదైంది.

కాగా.. ఆర్ కృష్ణయ్య ఏపీ కోటా నుంచి.. వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆర్.కృష్ణయ్యతోపాటు మరో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆర్ కృష్ణయ్యపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..