తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర దేవాలయ రెండో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి సర్వ భూపాల వాహనంపై ఊరేగించారు ఆలయ కమిటీ సభ్యులు. స్వామివారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్చి 1న మొదలైన ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. భక్తులకు అన్నీ సదుపాయాలు సమకూర్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుని తరించాలని కోరారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు:
05-03-2022 : పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
06-03-2022: హనుమంత వాహనం గజ వాహనం
07-03-2022 : సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
08-03-2022 : రథోత్సవం అశ్వవాహనం
09-03-2022 : చక్రస్నానం ధ్వజావరోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు.
జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు..