Hyderabad: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం లభ్యం.. 10 ఏళ్ల క్రితం తండ్రి కూడా ఇలాగే

|

Oct 04, 2021 | 7:06 PM

 మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Hyderabad: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం లభ్యం.. 10 ఏళ్ల క్రితం తండ్రి కూడా ఇలాగే
Jahangir Dead Body
Follow us on

మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఘట్‌కేసర్  పోలీస్ స్టేషన్ పరిధి కొర్రేముల గ్రామంలో మూసీనది ఒడ్డుకు అతడి డెడ్‌బాడీ కొట్టుకువచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన జహంగీర్‌ (35).. ఈ నెల 1 వ తేదీన ఉదయం 9.30 గంటల సమయంలో మూత్ర విసర్జనకు పక్కనే ఉన్న మూసీ ఒడ్డుకు వెళ్లాడు. కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగలోకి దిగాయి. నాలుగు రోజుల నుంచి మూసీ నదిలో బొట్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించలేదు. తాజాగా అతడి డెడ్‌బాడీ ఒడ్డుకు కొట్టుకువచ్చింది. బాడీపై ఉన్న ప్యాంటు, బెల్టు ఆధారంగా మృతదేహం నాలుగురోజుల క్రితం కొట్టుకుపోయిన జహంగీర్‌గా గుర్తించారు. జహంగీర్‌ (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కాగా జహంగీర్‌ తండ్రి కూడా పదేళ్ల క్రితం ఇదే తరహాలో మూసీలో పడి గల్లంతయ్యాడని కుటుంబసభ్యులు  తెలిపారు. 2011లో కురిసిన వర్షాలకు మూసీ ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ టైమ్‌లో చెత్త వేయడానికి వెళ్లిన జహంగీర్‌ తండ్రి మహ్మద్‌ యూసుఫ్‌ ప్రమాదవశాత్తు మూసీలో పడి గల్లంతయ్యాడు. అతని డెడ్‌‌‌బాడీ కూడా లభ్యం కాలేదు. ఇప్పుడు అదే తరహాలో అతని కుమారుడు సైతం నదిలో గల్లంతయి.. మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: ‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌’… సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు