Hyderabad: స్వాతికి నిత్యం నరకమే.. వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు.. బోడుప్పల్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు..

వాళ్లిద్దరూ బోడుప్పల్‌లో ఉంటారు. పెళ్లయి ఏడాదిన్నర కాలేదు. అయినా స్వాతి, మహేందర్‌ల మధ్య నిత్యం ఘర్షణ జరిగేది. స్వాతికి ఇల్లు నిత్య నరకంలా మారింది. గతంలో గర్భంతో ఉన్నప్పుడు స్వాతికి అబార్షన్‌ చేయించాడు. పుట్టింటివాళ్లతో ఆమెను మాట్లాడించేవాడు కాదు. ఆమె మళ్లీ గర్భవతి అయింది.

Hyderabad: స్వాతికి నిత్యం నరకమే.. వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు.. బోడుప్పల్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు..
Medchal Murder Case

Updated on: Aug 24, 2025 | 9:04 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అలాంటివాడు భార్యను ఎలా చూసుకుంటాడు. కంటికి రెప్పలా చూసుకోవాలి కదా? గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి కదా? కానీ అలా జరగలేదు. భార్య స్వాతి పాలిట రాక్షసుడిగా మారాడు మహేందర్‌ రెడ్డి. కడుపుతో ఉన్నా పుట్టింటింకి పంపించండి అని అడిగిన పాపానికి భార్యను పైలోకానికి పంపేశాడు. నిండు గర్భిణిని అతి కిరాతకంగా చంపి, బాడీని ముక్కలు ముక్కలు చేసి మూసీలో పడేశాడు. వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు!

వాళ్లిద్దరూ బోడుప్పల్‌లో ఉంటారు. పెళ్లయి ఏడాదిన్నర కాలేదు. అయినా స్వాతి, మహేందర్‌ల మధ్య నిత్యం ఘర్షణ జరిగేది. స్వాతికి ఇల్లు నిత్య నరకంలా మారింది. గతంలో గర్భంతో ఉన్నప్పుడు స్వాతికి అబార్షన్‌ చేయించాడు. పుట్టింటివాళ్లతో ఆమెను మాట్లాడించేవాడు కాదు. ఆమె మళ్లీ గర్భవతి అయింది. పుట్టింటికి వెళతా అని 22వ తేదీ రాత్రి మహేందర్‌ని అడిగింది. అతడు పంపించనన్నాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అంతే అతగాడిలో రాక్షసుడు నిద్ర లేచాడు. 23న ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం వచ్చి అత్యంత ఘోరానికి పాల్పడ్డాడు.

పక్కా ప్లాన్‌తో మర్డర్‌ చేశాడు మహేందర్‌. భార్యను చంపేశాక ఆమె బాడీని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించాడు మహేందర్‌. మొండెం మినహా కాళ్లు చేతులు తల ముక్కలుగా నరికి మూట కట్టి ప్రతాప్‌సింగారం దగ్గర మూసీలో పడేశాడు నిందితుడు.

ఇలా భార్య మృత దేహాన్ని మాయం చేసేశాడు. అయితే నట్టింట్లో స్వాతి మొండెం అలాగే ఉంది. భార్య గురించి ఎవ్వరూ ఎంక్వైరీ చేయకూడదని మరో దుర్మార్గపు స్కెచ్‌ వేశాడు. భార్య మిస్సయిందని బంధువులకు కట్టుకథలు చెప్పాడు. అత్తగారికి అంతా బాగానే ఉందంటూ, భార్య ఫోన్‌ నుంచి మెసేజ్‌ పెట్టాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం కక్కేశాడు.

ఇది అత్యంత దారుణమైన హత్య కావడంతో పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును స్పీడప్‌ చేశారు. రూమ్‌లో ఉన్న మొండెం స్వాతిదేనని నిర్ధారించేందుకు DNA టెస్ట్‌కి పంపించారు. మూసీలో పడేసిన శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు.

స్వాతిని వదిలించుకునేందుకు మర్డర్ ప్లాన్స్..

పుట్టింటికి పంపించండి అని అడిగితేనే భార్యను చంపేస్తారా? ఇంత చిన్న విషయానికే ఇంత ఘోరానికి పాల్పడతారా? అంటే దీనికి పెళ్లయినప్పటి నుంచి జరుగుతున్న గొడవలే కారణమా? గొడవలు, కౌన్సెలింగ్‌లు ఎక్కువైపోయి వ్యవహారం ఇక్కడిదాకా వచ్చిందా? ఇంటర్‌ కేస్ట్‌ మేరేజ్‌ కుటుంబాలను కలపలేకపోయిందా? మనుషులు కలిశారు కానీ మనసులు కలవలేదా? మహేందర్‌, స్వాతి విషయంలో ఇదే నిజం అయిందా? అవుననే అంటున్నారు పోలీసులు.

స్వాతిని వదిలించుకునేందుకు చాలాసార్లు చంపేందుకు మహేందర్‌ ప్రయత్నించినట్లు ఆమె తండ్రి రాములు చెప్పారు. తమ బిడ్డను అనేక సార్లు టార్చర్‌ చేశాడని రాములు ఆరోపించారు. స్వాతిని మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లైన కొన్నాళ్లకే తన బిడ్డను మహేందర్‌ వేధింపులకు గురిచేశాడని స్వాతి తల్లి ఆరోపిస్తోంది. తమతో స్వాతి మాట్లాడకుండా ఉండేలా తమ నెంబర్‌లు బ్లాక్‌లో పెట్టాడని ఆమె చెప్తోంది. అప్పుడప్పుడు భర్తకు తెలియకుండా తమతో స్వాతి మాట్లాడేది అని చెప్తున్నారు తల్లి . పెళ్లై 19 నెలలైనా తమ ఇంటికి పంపలేదని తమ బిడ్డను చంపేస్తామని చెప్పి మరీ హత్య చేశారంటోంది జ్యోతి తల్లి

2023లో జ్యోతిని కులాంతర వివాహం చేసుకున్నాడు మహేందర్‌రెడ్డి. జ్యోతిని వదిలించుకునేందుకు పెళ్లైన కొన్నిరోజుల నుంచే ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టాడని చెబుతున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితోనే మహేందర్‌రెడ్డి సైకోగా మారాడంటున్నారు వారి స్వగ్రామంలోని స్థానికులు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి కేసులు పెట్టుకున్నారని చెప్పారు స్థానికులు. కేసులు కొట్టేయించుకొని ఈమధ్యనే జ్యోతిని తీసుకెళ్లాడంటున్నారు స్థానికులు

పక్కా ప్లాన్‌తోనే స్వాతిని హత్య చేశాడు మహేందర్‌. డెడ్‌బాడీని ముక్కలు చేసి, ఆధారాలు మాయం చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత తన భార్య మిస్సయిందంటూ కట్టుకథలు చెప్పి మరో డ్రామాకు తెర తీశాడు. అంటే మహేందర్‌ రెడ్డి.. కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డరర్‌. బోడుప్పల్‌లో స్థానికులు కూడా అతడు వింతగా, విచిత్రంగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు. అయితే శబ్దాలకు పక్కింటివాళ్లకు అనుమానం రావడంతో మహేందర్‌ చేసిన నేరం, ఘోరం బయటపడింది. ఇంత కోల్డ్‌ బ్లడెడ్‌గా మర్డర్‌ చేసిన మహేందర్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉందా? పోలీసుల విచారణలో అవన్నీ బయటపడే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..