
సెప్టెంబర్ 7-8, 2025 మధ్య అద్భుతమైన ఖగోళ దృశ్యం జరగనుంది. ఈ రోజుల్లో సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. దీనినే ‘బ్లడ్ మూన్’ అని కూడా పిలుస్తారు. ఈ గ్రహణం దాదాపు 82 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో భూమి సూర్యుడు, చంద్రుల మధ్యకు వస్తుంది. దాంతో చంద్రుడు రాగి వర్ణంలో మెరిసిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.
ఈ బ్లడ్ మూన్‌ను చూసేందుకు భారతదేశం అత్యుత్తమ ప్రాంతం అని ఈ అధ్యయనం చెబుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఈ అద్భుతమైన దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చు.
ముంబై: ఇక్కడ బ్లడ్ మూన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైకప్పులు, పార్కులలో ఈ దృశ్యాన్ని చక్కగా చూడవచ్చు.
న్యూ ఢిల్లీ: న్యూ ఢిల్లీలో కూడా అద్భుతమైన వీక్షణ ఉంటుంది. ఓపెన్ స్పేసులలో చూస్తే దృశ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
కోల్‌కతా: కోల్‌కతాలో అర్ధరాత్రి తర్వాత గ్రహణం కనిపిస్తుంది. అందువల్ల తూర్పు భారత ప్రజలు దీనిని పూర్తిగా చూడవచ్చు.
బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై: దక్షిణ భారత నగరాలలో చంద్రుడు బాగా కనిపిస్తాడు. వీక్షణకు మంచి వాతావరణం ఉంటుంది.
అహ్మదాబాద్, పుణే, లక్నో: పశ్చిమ, మధ్య భారత నగరాల నుంచి కూడా ఈ గ్రహణాన్ని చూడవచ్చు.
భారత కాలమానం ప్రకారం, సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11:00 గంటలకు మొదలవుతుంది. అర్ధరాత్రి 12:22 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది.
వీక్షణకు కావాల్సిన అంశాలు
వాతావరణం: స్పష్టమైన ఆకాశం చాలా ముఖ్యం. మేఘాలు లేదా వర్షం ఉంటే వీక్షణకు అంతరాయం కలుగుతుంది.
ఖాళీ ప్రదేశాలు: పార్కులు, డాబాలు, సరస్సుల పక్కన ఉన్న ఎత్తైన ప్రదేశాలలో నుంచి వీక్షించడం ఉత్తమం.
భారతదేశం విస్తృత భౌగోళిక విస్తీర్ణం కలిగి ఉన్నందువల్ల, ఈ చంద్రగ్రహణాన్ని పూర్తిగా వీక్షించేందుకు ఇది ప్రపంచంలోనే ఒక ఉత్తమ ప్రదేశం.