Bandi Sanjay: “ఈ రోజు విమోచన దినోత్సవమే.. చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తే లేదు”.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్..
తెలంగాణ (Telangana) ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విమోచన దినోత్సవం జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. చరిత్రను...
తెలంగాణ (Telangana) ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విమోచన దినోత్సవం జరపక పోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించామని, సంస్కారబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దారుసలాం లో నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినోత్సవం జరుపుతోందని ఆరోపించారు. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఒవైసీ (OYC) కుటుంబానికి కేసీఆర్ దాసోహం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జెండా ఎగురవేయాలని ఆదేశాలు ఇవ్వకుండా సెలవు ప్రకటించడం సిగ్గు చేటని విమర్శించారు. కొమురం భీమ్, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరిచిపోలేమన్న బండి సంజయ్.. ఈ రోజు విమోచన దినోత్సవమేనని స్పష్టం చేశారు.
విమోచన దినం కోసం రాజీలేని పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమే. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవటం వెనుక ఉన్న కారణం ఏంటి? సెప్టెంబర్ 17న తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పరిపాలనా దశగా మార్పు చెందిన రోజు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై సంవత్సరాల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించిన రాష్ట్రం తెలంగాణ.
– బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు.. వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వివిధ పనులు ఉండటంతో ఆయన హాజరు కావడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటక సీఎంలు హైదరాబాద్ రానున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..