JP Nadda – Nithin: ఆసక్తికరంగా మారుతున్న తెలంగాణ పాలిటిక్స్.. సినీ హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ.. ఆ సినిమాపై ప్రశంసలు

|

Aug 27, 2022 | 8:02 PM

తెలంగాణ (Telangana) రాజ‌కీయలు రోజురోజుకు వాడీవేడీగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో..

JP Nadda - Nithin: ఆసక్తికరంగా మారుతున్న తెలంగాణ పాలిటిక్స్.. సినీ హీరో నితిన్ తో జేపీ నడ్డా భేటీ.. ఆ సినిమాపై ప్రశంసలు
Jp Nadda
Follow us on

తెలంగాణ (Telangana) రాజ‌కీయలు రోజురోజుకు వాడీవేడీగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోసారి అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యనేతలు, ప్రముఖులు, సినీ హీరోలతో భేటీ అవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా – ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఇవాళ వరంగల్ వేదికగా జరిగిన బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అనంతరం సినీ హీరో నితిన్ తో భేటీ అయ్యారు. శ‌నివారం సాయంత్రం హైదారాబాద్ లోని నోవాటెల్ హోట‌ల్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, క్రీడాకారుల‌ను అహ్వానించిన‌ట్లు తెలుస్తోంది.

అంతకు ముందు జేపీ నడ్డా పర్యటనలో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన జేపీ నడ్డా.. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో సంభాషణ గొప్పగా సాగిందని చెప్పారు. ప్రధాని మోదీ అందించిన వ్యక్తిగత మద్దతు, మార్గదర్శకత్వాన్ని మిథాలీ రాజ్ ప్రశంసించినట్టుగా చెప్పారు. హైదరాబాద్‌ నుండి హన్మకొండ బహిరంగ సభకు వెళ్లిన జేపీ నడ్డా కాకతీయ యూనివర్శిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట్‌నారాయణతో భేటీ అయ్యారు. అక్కడ తేనీరు సేవించి, తెలంగాణ రాజకీయాలు, ఉద్యమచరిత్రపై ఆయన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో వరంగల్‌ నుంచి శంషాబాద్‌లోని నోవాటెల్‌లో టాలీవుడ్ హీరో నితీష్‌తో భేటీ అయ్యారు. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా హీరో నితిన్ ను బీజేపీ టచ్ లోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీకి సపోర్ట్ గా పెద్ద ఎత్తున సినీ గ్లామర్ ను పెంచాలనే వ్యూహత్మకంగా పావులు కదుపుతోందని చర్చ మొదలైంది. నితీన్‌ కొత్త మూవీ మాచర్ల నియోజకవర్గంపై నడ్డా ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య సినిమాలపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..