Sai Pallavi: ‘కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైంది’.. రాజాసింగ్ సంచలన కామెంట్స్

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 3:51 PM

విరాటపర్వం సినీ హీరోయిన్‌ సాయిపల్లవి కశ్మీర్‌ఫైల్స్‌పై చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీ చినికి చినికి గాలివానగా మారుతోంది. విప్లవోద్యమ నేపథ్యంగా తీసిన విరాటపర్వం రీలీజ్‌కి ముందే సంచలనాత్మకంగా మారింది.

Sai Pallavi: కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైంది.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
Raja Singh Slams Sai Pallavi
Follow us on

Virata Parvam: విరాట పర్వం మూవీ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా సాయిపల్లవి గోసంరక్షకుల దాడులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ రంగుపులుముకున్నాయి. కశ్మీర్‌ ఫైల్స్‌పై సాయిపల్లవి కామెంట్స్‌ సర్వత్రా కాకరేపుతున్నాయి. సాయిపల్లవిపై గోసంరక్షకులు, భజరంగ్‌దళ్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh) మండిపడ్డారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడైందని పేర్కొన్నారు. కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదని ఆయన అన్నారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh) అన్ని పోలీస్ స్టేషన్లలో సాయి పల్లవిపై ఫిర్యాదులు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒకరిని అరెస్ట్ చేస్తే ఇంకెవర్వరు హిందువుల జోలికి రారని పేర్కొన్నారు. మూవీ పాపులర్ కావాలని.. తాము పాపులర్ కావాలని కొంతమంది నటీనటులు, డైరెక్టర్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సాయి పల్లవి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ అనుంబంధ సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికే సాయిపల్లవిపై హైదరాబాద్‌(Hyderabad)లోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. ఇస్లాంపైన కామెంట్‌ చేసే దమ్ముందా మీలో? క్రిస్టియన్స్‌పైన కామెంట్‌ చేస్తారా? మీకా దమ్ములేదు. మీకు దమ్ముంటే ముస్లింలపైనా, క్రిస్టియన్స్‌పైనా కామెంట్స్‌ చేయండి. అంతేకానీ ఏం చెయ్యరు కదా అని హిందువులపై కామెంట్స్‌ చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు రాజాసింగ్‌. తక్షణమే సాయిపల్లవి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.

విరాటపర్వం సినీ హీరోయిన్‌ సాయిపల్లవి కశ్మీర్‌ఫైల్స్‌పై చేసిన కామెంట్స్‌ కాంట్రవర్సీ చినికి చినికి గాలివానగా మారుతోంది. విప్లవోద్యమ నేపథ్యంగా తీసిన విరాటపర్వం రీలీజ్‌కి ముందే సంచలనాత్మకంగా మారింది. మరోవైపు దాడులు ఎక్కడైనా దాడులేనని, అది కశ్మీర్‌ అయినా, గో సంరక్షణలో అయినా ఒక్కటేనని, గోవుని తరలిస్తోన్న వాహనం డ్రైవర్‌పై గోసంరక్షకుల దాడిని ఉద్దేశించి సాయిపల్లవి వ్యాఖ్యానించారు. కశ్మీరీపండిట్లపై జరిగిన దాడిని కశ్మీర్‌ ఫైల్స్‌ లో చూపించారు. మరి ముస్లిం అయినందుకు ఓ డ్రైవర్‌పై దాడిని కూడా అలాగే చూడాలంటూ సాయిపల్లవి వ్యాఖ్యానించడంపై మండిపడుతున్నాయి బీజేపీ శ్రేణులు. వ్యక్తులు ఏ మతానికి చెందినా, ఏ వాదాన్ని నమ్మినా మానవత్వాన్ని మర్చిపోతే ప్రయోజనం లేదంటూ సాయిపల్లవి చేసిన కామెంట్స్ ఈ వివాదానికి బీజం వేశాయి. మరోవైపు సాయిపల్లవి తన వ్యాఖ్యలపై స్పందిస్తానని, అయితే ఇది సరైన సమయం కాదని క్రితం రోజే ప్రకటించారు.

 

సికింద్రాబాద్ హైటెన్షన్ లైవ్ దిగువన చూడండి