Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి.. కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ

|

Aug 26, 2022 | 9:08 PM

తెలంగాణ (Telangana) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రాణహాని పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కు పార్టీ లీడర్ గూడూరు నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సంజయ్ కు భద్రత పెంచాలని లేఖలో పేర్కొన్నారు....

Bandi Sanjay: బండి సంజయ్ కు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి.. కేంద్ర మంత్రి అమిత్ షా కు లేఖ
Bandi Sanjay
Follow us on

తెలంగాణ (Telangana) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రాణహాని పొంచి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కు పార్టీ లీడర్ గూడూరు నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఈ మేరకు సంజయ్ కు భద్రత పెంచాలని లేఖలో పేర్కొన్నారు. బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించడంతో పాటు, బుల్లెట్ ప్రూఫ్ కారును ఏర్పాటు చేయాలని కోరారు. సంజయ్ (Bandi Sanjay) పాద యాత్రకు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మొదటి నుంచి సమస్యలు సృష్టిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. జనగాం జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారని గుర్తు చేశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవన్న గూడూరు నారాయణ రెడ్డి.. టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని మండిపడ్డారు.

కాగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు (శనివారం) వరంగల్ లో జరగనుంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ లో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు పార్టీ నేతలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ముందుగా పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు, బీజేపీ తరపు వాదనలు విన్న న్యాయస్థానం సభ జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున వారికి ఇబ్బంది లేకుండా సభ నిర్వహించుకోవాలని సూచించింది. నిర్దేశించిన సమయంలోనే సభను పూర్తి చేయాలని, సభలో ఎక్కడ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండకూడదుని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి