Telangana: కేసీఆర్ ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

|

Jul 31, 2022 | 8:16 AM

తెలంగాణలో (Telangana) అధికార టీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పతనం తప్పదని చెప్పారు. ఆయనను ఓడించకపోతే తన జీవితానికి సార్థకత లేదని, అందుకే...

Telangana: కేసీఆర్ ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
Etela Rajender
Follow us on

తెలంగాణలో (Telangana) అధికార టీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు పతనం తప్పదని చెప్పారు. ఆయనను ఓడించకపోతే తన జీవితానికి సార్థకత లేదని, అందుకే గజ్వేల్‌లో పోటీ చేస్తానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో కాకుండా హుజూరాబాద్‌లో పోటీ చేసినా తాను పోటీ చేసి ఓడిస్తానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తాను మంచి మిత్రులమని, మోడీ పాలనలోనే దేశం ముందుకు పోతోందని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావలాంటిదని విమర్శించారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తారని ఆశిస్తున్నానన్నారు. అన్ని పార్టీల్లోని నేతలు, మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ తమతో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు. పెద్దాచిన్నా తేడా లేకుండా అందరినీ పార్టీలోకి చేర్చుకుంటామని, హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ లీడర్లు కూడా బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి చేరుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకో ఏడాది ఉందని.. అప్పుడు టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

కాగా.. అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. హుజూరాబాద్‌ ఫలితమే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందని వెల్లడించారు. ప్రతీదాన్ని ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టారని, గజ్వేల్ ప్రజలు కేసీఆర్ ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించిన బీజేపీ నేత సువేందు అధికారి అడుగుజాడల్లో నడుస్తున్నాని ఈటల గతంలో చేసిన వ్యా్ఖ్యలు సంచనలంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..