Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావు.. బండి సంజయ్ జోస్యం

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మునుగోడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మె్ల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని, ముందస్తు ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాుల అధికమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి...

Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 15 సీట్ల కన్నా ఎక్కువ రావు.. బండి సంజయ్ జోస్యం
Bandi Sanjay
Follow us
Ganesh Mudavath

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 30, 2022 | 11:08 PM

తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మునుగోడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని, ముందస్తు ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు అధికమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునుగోడులో (Munugodu) ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్, రావొద్దని కాంగ్రెస్‌ కోరుకుంటోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పాతబస్తీని కైవసం చేసుకుంటామని చెప్పారు. పార్టీ నిర్ణయం మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని పేర్కొన్నారు. అంతేగానీ సొంతంగా ప్రకటించుకునే సంప్రదాయం పార్టీలో లేదని వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 15 సీట్ల కన్నా ఎక్కువ రావని అంచనా వేశారు. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డాలే తమ బాస్‌లని బండి సంజయ్ చెప్పారు. ఎవరైనా కాషాయ జెండా కిందే పని చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరైన ప్రతిపక్షం లేక ఇన్ని రోజులు భరించారని, ఇక కేసీఆర్ ఆటలు చెల్లవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్న సంజయ్.. అన్ని రంగాల్లో టీఆర్ఎస్ నేతలు మాఫియా నేతల్లా తయారయ్యారని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..