హైదరాబాద్ న్యూస్, జూలై 24: నగరంలోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి పడి వాహనదారుడు మృతి చెందాడు. రాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైఓవర్ మీదకు పడిపోయారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు చందర్ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న మధుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
కాగా, ప్రమాద సమయంలో దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బైక్ వంద అడుగులపై నుంచి కింద పడింది. ఈ నేపథ్యంలో అతివేగం ప్రమాదకరమని.. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో, తెల్లవారు జామున నెమ్మదిగా పోవడమే ప్రయాణికులకు సురక్షితమని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి…