హైదరాబాద్, ఆగస్టు 21: హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియాను తుడిచి పెట్టేస్తున్నారు పోలీసులు. హైదరాబాదులో ఒక్క సిగ్నల్ దగ్గర కాసేపు ఆగమంటే చాలు ట్రాన్స్ జెండర్లు, బిచ్చగాళ్ల దందా మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది… ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వచ్చిన డబ్బులతో ఏకంగా 80 లక్షలు విలువ చేసే భూములు కొన్నారు ఇద్దరు సోదరులు. కేతావత్ రవి, కెతావత్ మంగు ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందిన సోదరులు. వీరికి 2020 లో గడ్డి గణేష్ అనే మరో వ్యక్తి పరిచయం అవ్వడంతో వీరందరూ కలిసి “అమ్మ చేయూత ఫౌండేషన్ “అనే సంస్థను ప్రారంభించారు. వికలాంగుల రక్షణ ఫండ్ రైజింగ్ పేరుతో దోచుకునేందుకు పెద్ద స్కెచ్ వేసారు.
దీనికోసం పనిచేసేందుకు నిరుద్యోగ మహిళలు చిన్నారులను టార్గెట్గా చేసి వారికి కమిషన్లు ఆశ చూపి రంగంలోకి దించుతున్నారు.. ప్రతిరోజు ఉదయం 9 గంటలకల్లా వీరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్యూటీ కి ఎక్కాల్సిందే. ఫండ్ రైసింగ్ కాబట్టి వీరికి ఐడి కార్డులు, కలెక్షన్ బాక్సులు, విసిటింగ్ కార్డులు ఇచ్చి ప్రజల నుండి దోచుకునేలా చేస్తున్నారు .. అలా వచ్చిన కలెక్షన్ లో 35 % వీరికి ఇచ్చేయగా మిగతా సొమ్ముతో లక్సరీగా భూములు కొనుక్కుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు… ఆర్గనైజ్డ్ బెగ్గిoగ్ మాఫియా పై పోలీసులు డ్రైవ్ చేపడుతున్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 10మంది ఆర్గనైజర్లు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వీరందరూ కూడా నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం..
హైదరాబాదులో చాలా సిగ్నల్ వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు మరీ దారుణంగా ఉంటున్నాయి.. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు వెంటనే ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి నానా హంగామా చేస్తూ ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ట్రాన్స్ జెండరర్లు.. ట్రాఫిక్ జాములు, పబ్లిక్ ప్లేస్ లే వీరు పెట్టుబడి .. కొంతమంది అబ్బాయిలు ట్రాన్స్ జెండర్ గా మారి దోచుకుంటున్నారు. ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అడిగిన డబ్బులు ఇవ్వకుంటే కారులపై ఉండటం దుర్భాషలు అడగటం దాడి చేయడం వంటి వాటికి పాల్పడుతున్నారు పలువురు ట్రాన్స్ జెండర్లు..
ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన ఒక ఫంక్షన్ కి వెళ్లి ఏకంగా లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లక్ష రూపాయలు ఇచ్చేందుకు నిర్వాహకులు నిరాకరించటంతో అక్కడికి వెళ్లిన బెగ్గింగ్ మాఫియా నానా హంగామా సృష్టించింది.వీరి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. సికింద్రాబాద్ సైడ్ బెగ్గింగ్ మాఫియాను రాజేష్ యాదవ్ తో పాటు అనిత అనే మహిళ లీడ్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. గోపాలపురం ,రాంగోపాల్ పేట్, మహంకాళి పోలీస్ స్టేషన్ ల పరిధిలోవీరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తాజా ఘటనలు నేపథ్యంలో బెట్టింగ్ మాఫియా పై వరుస దాడులకు పాల్పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పదిమందిని అరెస్టు చేస్తే సికింద్రాబాద్లో 19 మంది బెగ్గింగ్ మాఫియా ను నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు… బేకింగ్ మాఫియా పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు. చేస్తామని ఎవరైనా డబ్బుల కోసం వేధిస్తే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. ఫంక్షన్లలో ,ట్రాఫిక్ జాముల్లో, ఇంటికి నేరుగా వచ్చి ట్రాన్స్ జెండర్లు వేధిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సివి ఆనంద్ ట్వీట్ చేశారు.. బెగ్గింగ్ రూపంలో దోచుకుంటున్న ఈ ఆర్గనైజ్డ్ ముఠాలను పూర్తిగా నివారిస్తామని ఆయన ట్వీట్ చేశారు. అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 100 ద్వారా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సివి ఆనంధ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం