Green India Challenge: పర్యవరణాన్ని పరిరక్షణకు మేము సైతం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన విశాల్, గుత్తా జ్వాల

|

Feb 06, 2022 | 12:09 PM

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో..

Green India Challenge: పర్యవరణాన్ని పరిరక్షణకు మేము సైతం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన విశాల్, గుత్తా జ్వాల
Green India Challenge Min
Follow us on

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌(Green India Challenge)కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా  జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల(Badminton player Gutta Jwala), సినీనటుడు విష్ణు విశాల్ ( Actor Vishnu Vishal) దంపతులు మొక్కలు నాటారు. అనంతరం విష్ణు విశాల్, గుత్తా జ్వాల మాట్లాడుతూ.. పర్యవరణాన్ని పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కి అభినందనలు తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే ఆవకాశం కలిగినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కి ఇరువురు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్ కి విష్ణు విశాల్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. కార్యక్రమం అనంతరం విష్ణు విశాల్,గుత్తాజ్వాల కి గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

ఇవి కూడా చదవండి: ICC U19 World Cup: ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ యువ తేజాలు.. మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్..

Modi in Hyderabad: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం.. ఇంతకీ గులాబీ దళపతి వ్యూహమేంటి?