Hyderabad: సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? ఇకపై జేబుల్లో డబ్బులు లేకున్నా జర్నీ చేయొచ్చు..

ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగాయి. యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌కు జనం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు క్యాష్‌లెస్‌ సేవలను అందిస్తున్నాయి. రవాణ రంగంలోనూ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఆర్టీసీ సైతం...

Hyderabad: సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? ఇకపై జేబుల్లో డబ్బులు లేకున్నా జర్నీ చేయొచ్చు..
Hyderabad City Bus

Updated on: Jun 16, 2023 | 1:26 PM

ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగాయి. యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌కు జనం మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు క్యాష్‌లెస్‌ సేవలను అందిస్తున్నాయి. రవాణ రంగంలోనూ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఆర్టీసీ సైతం నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే దూర ప్రాంతాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో నడిచే సిటీ బస్సుల్లోనూ క్యాష్‌లెస్‌ సేవలను తీసుకురానున్నారు.

నగంరలో నడుస్తున్న సిటీ బస్సుల్లో క్యాష్‌లెస్‌ లావాదేవీల ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై ఆర్టీసీ ఐటీ శాఖ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సిటీ బస్సుల్లో క్యాష్‌ లెస్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. నిజానికి గతేడాదే సిటీ బస్సుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది.

ఇక ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో డబ్బులతో పాటు ఫోన్‌పే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే వెసులుబాటును ప్రయాణికులకు అధికారులు కల్పించారు. ఇదే విధానాన్ని సిటీ బస్సుల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరి ఈ విధానం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..