Railway News: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు.. మరిన్ని దారిమళ్లింపు

SC Railway: భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.

Railway News: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు.. మరిన్ని దారిమళ్లింపు
Railway Passenger Alert

Edited By:

Updated on: Nov 20, 2021 | 6:44 PM

Railway Passenger Alert: భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.  ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తిరుపతి నుంచి గుంతకల్‌కు వెళ్లే రైలు (నెం.07656) ను శనివారం రద్దు చేశారు. అలాగే తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు నడిచే రైలు (నెం.16054)ను శనివారంనాడు రద్దు చేశారు. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి నడిచే రైలు(నెంబర్.16203) కూడా రద్దయ్యింది.

అలాగే ముంబై సీఎస్టీ నుంచి నాగర్‌కోయిల్‌కు నడిచే రైలు (నెంబర్.16351)ను ధర్మవారం, ఎల్లంక, చన్నసంద్ర, క్రిష్ణరాజపురం, వైట్‌ఫీల్డ్, జోలార్‌పేటై, కాట్పాడి మీదుగా దారిమళ్లించారు. ఈ రైలు ముంబై సీఎస్టీ నుంచి శుక్రవారం బయలుదేరింది. మదురై నుంచి ముంబై ఎల్‌టీటీకి వెళ్లే రైలు(నెం.22102)ను దిండిక్కల్, తిరుచ్చి, ఈరోడ్ మీదుగా దారిమల్లించారు.

భారీ వర్షాల కారణంగా శుక్రవారంనాడు కూడా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారిమళ్లించగా.. కొన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు. భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

Also Read..

Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

Chinna Jeeyar Swamy-CM Jagan: సమతామూర్తి విగ్రహావిష్కరణకు సీఎం జగన్‌ను ఆహ్వానించిన చిన్నజీయర్‌ స్వామి