ATM Cash Robbery: దొంగలు రకరకాల రూపాల్లో ఉంటారు. ఏ పని చేస్తున్నా దొంగ బుద్ధిని పోనిచ్చుకోరు. డబ్బుకనబడితే చాలు నొక్కేద్దామన్న పనిలోనే ఉంటారు. అలాంటి దొంగ కథ ఇది. ఈ ప్రపంచంలో అత్యంత క్రియేటివ్‌గా ఆలోచించే వారిలో టాప్‌లిస్టులో ఉంటారు. ఎప్పటికపుడు అప్‌డేట్ అవుతూ.. రూట్స్ మారుస్తూ తమ ప్లాన్‌ను అమలు చేస్తుంటారు. ఇలాంటి దొంగే మేడ్చల్ మల్కాజ్‌గిరి (medchal malkajgiri) జిల్లాలో అవతరించాడు. దుండిగల్ పీఎస్ పరిధి సాయిబాబా నగర్‌లో ఓ దొంగ ఏటీఎం క్యాష్ వాహనంతో పరార్ అయ్యాడు. భారీ నగదుతో (Robbery) డ్రైవర్ సాగర్ ఉడాయించాడు. దుండిగల్ (dundigal) సాయిబాబా నగర్లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలో డిపాజిట్ చేయడానికి వాహనం వచ్చింది. రైటర్ సంస్థకు చెందినఈ వాహనంలో 36 లక్షలు రూపాయల నగదు ఉంది. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో 3 లక్షల రూపాయల నగదుని వాహనం నుంచి క్యాషియర్ తీసుకున్నాడు. ఆయనతోపాటు గన్ మ్యాన్ దిగి ఏటీఎంలో డబ్బుని నింపుతున్నారు. వాహనాన్ని మలుపుకొస్తానని చెప్పిన డ్రైవర్.. అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. మలుపుకుని వస్తాడని క్యాషియర్, గన్‌మ్యాన్ ఎదురుచూశారు. ఎంతోసేపటికి గానీ అసలు విషయం తెలియలేదు. వెంటనే డ్రైవర్ డబ్బుతో ఉడాయించాడని తెలుసుకుని.. తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు వివరాలు అడిగితెలుసుకున్నారు. వాహనానికి జీపీఎస్ ఉండడంతో దాని సాయంతో సెర్చింగ్ మొదలుపెట్టారు. నర్సాపూర్ అడవిలో వాహనం జాడ దొరికింది. కాని అందులో 36లక్షల రూపాయల డబ్బు మాయమైంది. వాహనం, దానిపక్కనే తుపాకీ కూడా పడిఉంది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దొంగ వివరాలపై ఆరా తీస్తున్నారు. గతంలో ఇలాంటి దొంగతనాలేమైనా జరిగాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంస్థలో నమోదైన వివరాలు, ఆధార్ ఆధారంగా వివరాలు సేకరించారు. దుండగుడు వేరే రాష్ట్రాలకు గాని.. విదేశాలకు గాని పారిపోయే చాన్స్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Also Read: