Hyderabad Metro: మాకు కావాలి మెట్రో.. విస్తరణతో తెరపైకి భాగ్యనగర్‌వాసుల కొత్త డిమాండ్లు

ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకనుంచి మరో లెక్క. రాబోయే రోజుల్లో నగరంలో ఏ మూల నుంచి అయినా రెక్కలు కట్టుకుని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఎగిరిపోవచ్చు.ఈ కలను సాకారం చేయనుంది మెట్రో ఎక్స్‌ప్రెస్‌. అయితే..

Hyderabad Metro: మాకు కావాలి మెట్రో.. విస్తరణతో తెరపైకి భాగ్యనగర్‌వాసుల కొత్త డిమాండ్లు
Hyderabad Metro Train

Updated on: Dec 06, 2022 | 1:14 PM

విశ్వనగరంగా పేరొందిన భాగ్యనగరంలో మెట్రో పరుగులు ఇకపై శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టు వరకు సాగనున్నాయి. నగర శివార్లలోని విమానాశ్రయానికి మెట్రో సేవల కోసం నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల నుంచి మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందిస్తుండగా.. కీలకమైన ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టివిటీకి అడుగులు పడ్డాయి. మైండ్ స్పేస్ జంక్షన్‌ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎక్స్ ప్రెస్ మెట్రో రానుంది. దీనికి డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ. 6,250 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనుంది.  మెట్రోరైల్‌ సెకండ్ ఫేజ్‌కి ఈనెల 9న ఫౌండేషన్‌ స్టోన్‌ పడనుంది. 6వేల 250 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రెండో దశ పనులకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ దగ్గర శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్‌.

పబ్లిక్ డిమాడ్స్..

  1. ఖాజాగూడ నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ మెట్రోని మణికొండ మీదుగా వేయాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఉందని దీంతోనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
  2. శంషాబాద్‌ వరకే పరిమితం చేయకుండా.. అక్కడి నుంచి ఆదిభట్ల వరకు పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఆదిభట్ల మెట్రోరైలు సాధన పోరాట సమితినే ఏర్పాటు చేశారు. తొలుత ఆదిభట్లకు విస్తరించి.. తర్వాతి దశలో రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు విస్తరించాలని సూచిస్తున్నారు.
  3. ట్రాఫిక్‌ రద్దీ పెరిగిన దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి మెట్రోని హయత్‌నగర్‌ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కోరనున్నట్లు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
  4. పాతబస్తీలో ఆగిపోయిన జేబీఎస్‌-ఫలక్‌నుమా కారిడార్‌-2 పనులు ప్రారంభించాలని కోరారు. 5.5 కి.మీ దూరం ఉన్న ఈ కారిడార్‌కు 500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. పరిసర ప్రాంతాల యువత హైటెక్‌ సిటీ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమన్నారు ఓవైసీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం