హైదరాబాద్ నగర శివారులో కాల్పులు కలకలం రేపాయి. శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై నటుడు మనోజ్ నాయుడు కాల్పులు జరిపాడు. ఎయిర్ గన్‌తో మనోజ్ కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ పిల్లెట్స్ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ దాస్ శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు.
సిద్ధార్థ్ భార్యతో మనోజ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనోజ్, సిద్ధార్థ్ భార్య ఇద్దరూ సెలబ్రిటీ క్లబ్‌లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ దాస్ సెలబ్రిటీ క్లబ్‌కు చేరకున్నాడు. వివాహేతర సంబంధం విషయమై క్లబ్‌లో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మనోజ్.. సిద్ధార్థ్‌పై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. పిల్లెట్స్ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ్ భార్యతో మనోజ్ 2019 నుంచి సహజీవనం చేస్తున్నట్లు తేలింది. కూతురు, కొడుకు ఇద్దరు భార్యతోనే ఉండడంతో.. కూతురును చూసేందుకు సిద్ధార్థ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆశ్రయించాడు. ఇదే క్రమంలోనే అక్కను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సిద్ధార్థ్‌కి కొడుకు చెప్పాడు. దీంతో కూతురును చూసేందుకు వెంటనే సెలబ్రిటీ క్లబ్‌లోని రిసార్ట్ విల్లాకు వచ్చాడు సిద్ధార్థ్. ఈ సమయంలో జరిగిన వాగ్వాదాం నేపథ్యంలో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపాడు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..