పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం.. రోహిణి ఫౌండేషన్ కు అండగా నిలిచిన ఆర్సెసియస్ కంపెనీ

"సాధారణ ఆరోగ్య శ్రేయస్సు కోసం నోటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన చిరునవ్వును కలిగి ఉండాలి." ఇదే లక్ష్యంతో పని చేస్తోంది రోహిణి (రైట్ టు ఓరల్ హెల్త్ సొసైటి) సంస్థ. దంత సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు రోహిణి ఫౌండేషన్ ప్రతినిధులు.

పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్యం.. రోహిణి ఫౌండేషన్ కు అండగా నిలిచిన ఆర్సెసియస్ కంపెనీ
Rohini Right To Oral Health Society
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 14, 2024 | 9:14 PM

“సాధారణ ఆరోగ్య శ్రేయస్సు కోసం నోటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి బిడ్డ ఆరోగ్యకరమైన చిరునవ్వును కలిగి ఉండాలి.” ఇదే లక్ష్యంతో పని చేస్తోంది రోహిణి (రైట్ టు ఓరల్ హెల్త్ సొసైటి) సంస్థ. దంత సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు రోహిణి ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ సంస్థ సేవలను గుర్తించిన సాఫ్ట్ వేర్ సంస్ధ Arcesium ముందుకు వచ్చింది. చిన్నారులకు ఉచిత సేవలు అందిస్తున్న రోహిణి సంస్థకు మద్దతుగా నిలిచింది. ఎక్కువ మంది చిన్నారుల వద్దకు సకాలంలో డాక్టర్లు చేరుకోవడానికి అవసరమైన వాహన సదుపాయం కల్పించాలనుకుంది.

ఇందులో భాగంగా టియాగో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాన్ని గిఫ్ట్ గా అందించింది. ఇందుకు SVP హైదరాబాద్ ఛాప్టర్ట్ సపోర్ట్‌గా నిలిచింది. ఈ వాహనాన్ని Arcesium సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ (హూమన్ క్యాపిటల్ ) సుజిత రావూరి, సునీల్ పరంబాత్ కలిసి రోహిణి ఫౌండేషన్ వ్యవస్ధాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకురి సంపత్ రెడ్డికి కొత్త వాహనాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కారును బహుమతిగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

పేద పిల్లలకు ఉచిత వైద్యం అందిస్తున్న రోహిణి ఫౌండేషన్ ఓరల్ హెల్త్ సొసైటీ అందరి మన్నలు పొందుతోంది. భారతదేశంలోని ప్రముఖ ముగ్గురు పీడియాట్రిక్ డెంటిస్ట్‌లు, ముగ్గురు డెంటల్ సర్జన్లు, ఒక MBBS డాక్టర్‌ల సమూహంతో ఏర్పడిన లాభాపేక్ష లేని సంస్థ. 2019లో ఏర్పాటైన ఈ సంస్థ పిల్లల దంత అవసరాలను సమగ్రంగా అందించడానికి, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందేందుకు కార్యక్రమాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

నోటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తోంది రోహిణి ఫౌండేషన్. ప్రైవేట్ సెటప్‌లో దంత వైద్యం చేయించుకోలేని ఈ పిల్లల సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వినికిడి పిల్లల నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉచిత సేవలు అందిస్తున్నారు. తెలంగాణలోని బలహీనమైన పాఠశాలలు, విజువల్లీ ఛాలెంజ్డ్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్న రోహిణి ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ పిల్లలలో 2025 నాటికి దంత వ్యాధుల ప్రాబల్యం తీవ్రతను 70% వరకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..