Neera Cafe: నీరా కేఫ్‌లో జోగి రమేష్, యాక్టర్ సుమన్.. ఈ పథకంపై సీఎం జగన్‌తో చర్చిస్తామన్న ఏపీ మంత్రి.. ఇంకా ఏమన్నారంటే..?

| Edited By: Ravi Kiran

May 17, 2023 | 9:10 AM

Neera Cafe: హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి మంత్రి జోగి రమేష్, సినీ నటుడు సుమన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. స్వయంగా నీరా టేస్ట్ చేశారు. అక్కడ విక్రయిస్తున్న తినుబండారాల రుచి..

Neera Cafe: నీరా కేఫ్‌లో జోగి రమేష్, యాక్టర్ సుమన్.. ఈ పథకంపై సీఎం జగన్‌తో చర్చిస్తామన్న ఏపీ మంత్రి.. ఇంకా ఏమన్నారంటే..?
Suman And Jogi Ramesh With Ts Minister Srinivas Goud
Follow us on

Neera Cafe: హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సినీ నటుడు సుమన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. స్వయంగా నీరా టేస్ట్ చేశారు. అక్కడ విక్రయిస్తున్న తినుబండారాల రుచి చూశారు. నీరా కేఫ్‌లో ఒక్క గ్లాస్ నీరాను 50 రూపాయలకు, 300 ml బాటిల్‌ను 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. నీరా కేఫ్ ప్రత్యేకతలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా గీత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జనానికి స్వచ్ఛమైన నీరా అందిస్తూ గీత కార్మిక వర్గాన్ని ఆదుకుంటున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ మంత్రి జోగు రమేష్ అభినందించారు. నీరా కేఫ్ ఏర్పాటు, గీత కార్మికుల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని ఏపీలో అమలుచేసే అంశంపై సీఎం జగన్‌తో చర్చిస్తామన్నారు.

ఇంకా రైతు బీమా తరహాలో తెలంగాణ ప్రభుత్వం గీత వృత్తిదారులకు ప్రకటించిన బీమా, ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ఏపీలో కూడా అమలుచేసుందుకు కృషి చేస్తామన్నారు. నీరాలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి, శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైందన్నారు జోగి రమేష్‌. వేదాల్లోనూ నీరా గురించి ప్రస్తావన ఉందని.. కాలక్రమంలో నీరా గురించి తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు. జనం ఆరోగ్యాన్ని పెంచే నీరాను ప్రమోట్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని హీరో సుమన్ అభినందించారు. అచ్చం పల్లె వాతావరణాన్ని తలపిస్తున్న నీరా కేఫ్‌కు నిత్యం ఎంతో మంది వచ్చి.. నీరా టేస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..