CM Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.. కాటసాని కుమారుడి పెళ్లికి హాజరైన సిఎం జగన్..

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాటసాని కుమారుడు శివఓబుల్‌రెడ్డి వివాహం మేధాశ్రీతో..

CM Jagan: నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.. కాటసాని కుమారుడి పెళ్లికి హాజరైన సిఎం జగన్..
CM Jagan Attends MLA Katasani Rami Reddy Son Wedding Hyderabad

Updated on: May 18, 2022 | 2:59 PM

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాటసాని కుమారుడు శివఓబుల్‌రెడ్డి వివాహం మేధాశ్రీతో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే.. పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇదిలావుంటే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి అధికారిక హోదాలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.  సీఎం జగన్.. ఏపీలో సంక్షేమం పైన ఇప్పటి వరకు ప్రధానంగా ఫోకస్ చేయగా.. ఇప్పుడు ఏపీకి పెట్టుబడల దిశగా దావోస్ లో 30 మంది ఎమ్మెన్సీ ప్రతినిధులతో సమావేశాలు జరపనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ లోనే ఉంటారు. సీఎం జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన.. అమర్నాధ్.. అధికారులు సీఎంతో పాటు వెళ్లనున్నారు. అయితే, ఏపీలో పెట్టుబడుల అవకాశాలు.. అక్కడ ఉన్న అనుకూల పరిస్థితుల పైన వివరించి.. పరిశ్రమల స్థాపనకు ఆహ్వానించనున్నారు.

ఇవి కూడా చదవండి