కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీ రామనగరంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు చేశారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు. 114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. హోమ గుండాలను కూడా ఆయన సందర్శించారు. శ్రీ రామనగరాన్ని అంతా కలియ దిరిగారు. అనురాగ్ ఠాకూర్‌కు అర్చకులు ఆశ్వీదం అందజేశారు.
Read Also.. CM KCR: అందుకే రాజ్యాంగం మార్చాలన్నాను..అందులో తప్పేముంది? కేంద్రంపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్..