Hyderabad: సొంత అక్కే నిందితురాలు.. రాయదుర్గం కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్.. ఏం చేసిందో తెలుసా..?

|

Jan 06, 2024 | 9:28 PM

హైదరాబాద్‌ రాయదుర్గంలో సంచలనం రేపిన కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు సురేందర్‌ను సేఫ్‌గా కాపాడారు పోలీసులు. ఈ ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ ఎవరిది? ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్ చేశారు? అనే వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయ్ సురేందర్‌ ఈనెల 4న కనిపించకుండాపోయాడు.

Hyderabad: సొంత అక్కే నిందితురాలు.. రాయదుర్గం కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్.. ఏం చేసిందో తెలుసా..?
Crime News
Follow us on

హైదరాబాద్‌ రాయదుర్గంలో సంచలనం రేపిన కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు సురేందర్‌ను సేఫ్‌గా కాపాడారు పోలీసులు. ఈ ఎపిసోడ్‌లో కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ ఎవరిది? ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టేందుకు ప్లాన్ చేశారు? అనే వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయ్ సురేందర్‌ ఈనెల 4న కనిపించకుండాపోయాడు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు అయినవాళ్ల దగ్గర ఆరాతీశారు. అయితే, అగంతకులు కాల్ చేసి 2కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే.. కాజాగూడ చెరువు దగ్గర సురేందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో గుర్తించారు. మొబైల్‌ నంబర్‌, వాట్సప్‌ ఆధారంగా కుటుంబసభ్యులతో కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి.. వైఫైతో మాట్లాడినట్టు ఐడెంటిఫై చేశారు. అయితే సురేందర్ ఎక్కడున్నాడనే దానిపై క్లారిటీ రాలేదు. కిడ్నాప్ సమయంలో సురేందర్‌తో పాటు ఉన్న మరో వ్యక్తి నుంచి కూడా సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్లు ఓ కారులో.. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నట్టు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే సురేందర్‌ను వదిలేసి పారిపోయారు.

నిందితులు సురేష్.. సహా.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నాపర్ సురేష్‌తో సురేందర్ సోదరి 2కోట్ల రూపాయల కోసం కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తేల్చారు. మొదట.. సురేందర్‌ను సురేందర్‌ను రాయదుర్గం పిలిపించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత సురేందర్‌ను కిడ్నాపర్లు నల్లమలకు తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర.. కిడ్నాప్ చేసిన కారును ఫారెస్ట్ సిబ్బంది అందించిన సమాచారంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను వేర్వేరు కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..