
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ.. ఈ రోజు తేటికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి దక్షిణ అంతర కర్ణాటక నుండి మరాఠ్వాడ వరకు ఉన్న ద్రోణి ఈరోజు వాయువ్య తమిళనాడు నుండి దక్షిణ అంతర కర్ణాటక అంతర్భగముగా మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ – యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
బుధవారం, గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్ర – రాయలసీమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరాత్వాడ వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు వాయువ్య తమిళనాడు నుండి మధ్యా మహారాష్ట్ర వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..