Weather Alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Andhra and Telangana Weather Update

Updated on: Aug 19, 2026 | 8:22 AM

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తవాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురస్తాయని వెల్లడించింది. ఈ మేరకు కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ మేరకు వెదర్ డిపార్ట్‌మెంట్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచనలు జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా.. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us