Telangana: వాటే ఐడియా.. ఈ ఎస్‌ఐ చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!

విధులు అందరూ నిర్వర్తిస్తారు. కానీ చేసే పనిని కూడా చిత్తశుద్ధితో కొందరు మాత్రమే చేస్తారు. అలా ఆలోచించేవాళ్లు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివారిలోనే ఈ ట్రాఫిక్ ఎస్సై ఒకరు.. రోజూ విధి నిర్వహణలో భాగంగా సైకిల్‌పై వస్తున్నారు. సైకిల్‌పైనే డ్యూటీ చేస్తున్నారు. ఇది ఎక్కడ? ఏంటి? అని తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Telangana: వాటే ఐడియా.. ఈ ఎస్‌ఐ చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Duties On A Bicycle
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 12, 2024 | 6:05 PM

విధులు అందరూ నిర్వర్తిస్తారు. కానీ చేసే పనిని కూడా చిత్తశుద్ధితో కొందరు మాత్రమే చేస్తారు. అలా ఆలోచించేవాళ్లు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివారిలోనే ఈ ట్రాఫిక్ ఎస్సై ఒకరు.. రోజూ విధి నిర్వహణలో భాగంగా సైకిల్‌పై వస్తున్నారు. సైకిల్‌పైనే డ్యూటీ చేస్తున్నారు. ఇది ఎక్కడ? ఏంటి? అని తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

హైదరాబాద్ నగరం బేగంపేట్ ప్రాంతంలో ఆనంద్ అనే ట్రాఫిక్ ఎస్సై విధులు నిర్వర్తిస్తుంటారు. నగరంలో ట్రాఫిక్ సమస్య అనేది ఎంత ఉంటుందో దానికి తోడు కాలుష్య ప్రభావం ఏ మేరకు ఉంటుందో మనకు తెలిసిందే. తీవ్ర కాలుష్యం ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కొన్నేళ్లుగా ట్రాఫిక్‌లోనే డ్యూటీ చేసి చేసి ఆ దుమ్ము, కాలుష్యం పడకపోవడంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి సైకిల్‌పైనే తన బాధ్యతలు నిర్వహించాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు.. ఇంటి నుంచి కూడా ఆ సైకిల్‌పైనే డ్యూటీకి వస్తానని కూడా ఆ ఎస్సై చెబుతున్నాడు. సమాజంలో పెరిగిపోయిన కాలుష్య సమస్యని నియంత్రించే క్రమంలో తన వంతుగా ఏదైనా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నాడు. అదే రీతిలో హైదరాబాద్ రోడ్లపై సైకిల్‌పైనే తిరుగుతూ డ్యూటీ చేస్తున్నాడు. ఇది చూసి మనలో చాలా మందికి దీనికేనా, ఈ మాత్రం దానికే కాలుష్యం తగ్గిపోతుందా అనే ఆలోచన రావొచ్చు. అతన్ని ఆలోచన చిన్నదైనా కానీ దాని వెనక అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఏది ఏమైనా ఈ ట్రాఫిక్ ఎస్సై చేసిన ఆలోచనకు మెచ్చుకోవాల్సిందే.. ఆ మాటకు వస్తే మనమూ పాటించాల్సిందే.

ఎస్‌ఐ మాట్లాడుతున్న వీడియో ఇదిగో:

నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ద్వారా ఎలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నామో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడం కూడా కష్టమే. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆలోచనల ద్వారా ఎంతో కొంత ఫలితం మాత్రం ఉండకపోదు. ఆ విషయంలో ఈ ట్రాఫిక్ ఎస్సై ఆనంద్ చేస్తున్న కృషికి సోషల్ మీడియాలో నెటిజన్లు సలాం కొడుతున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి