Amarender: గొడవలు అందుకే.. పల్లవి ఆరోపణలపై స్పందించిన అమరేందర్‌

| Edited By: Subhash Goud

Feb 21, 2024 | 10:15 PM

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో.. నిత్య పెళ్లికొడుకంటూ వచ్చిన వార్తలు.. పూర్తి అవాస్తవం అన్నారు అమరేందర్‌. పెళ్లయిన రోజు నుంచే తన భార్య పల్లవి వేధింపులకు గురి చేసిందన్నారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే విడాకులకు అప్లై చేశామని చెబుతున్నారు. ఆడ పిల్లలు పుట్టారని వదిలించుకోవాలని చూడటం అనేది పూర్తి అబద్ధమన్నారు అమరేందర్. ఆస్తి కోసం.. తనతో పాటు.. తన పేరెంట్స్‌ను కూడా చంపాలనుకుంటున్నారని..

Amarender: గొడవలు అందుకే.. పల్లవి ఆరోపణలపై స్పందించిన అమరేందర్‌
Amarender
Follow us on

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో.. నిత్య పెళ్లికొడుకంటూ వచ్చిన వార్తలు.. పూర్తి అవాస్తవం అన్నారు అమరేందర్‌. పెళ్లయిన రోజు నుంచే తన భార్య పల్లవి వేధింపులకు గురి చేసిందన్నారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే విడాకులకు అప్లై చేశామని చెబుతున్నారు. ఆడ పిల్లలు పుట్టారని వదిలించుకోవాలని చూడటం అనేది పూర్తి అబద్ధమన్నారు అమరేందర్. ఆస్తి కోసం.. తనతో పాటు.. తన పేరెంట్స్‌ను కూడా చంపాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే పల్లవి తరుపు బందువులు తమపై దాడులు చేసినట్లు చెబుతున్నాడు. ప్రాణ భయంతోనే తాము వేరే దగ్గరికి వచ్చామని, ప్రస్తుతం నాగోల్‌లో పల్లవి ఉంటున్న ఇల్లు కూడా తమదే అన్నారు అమరేందర్. పెళ్ళి రోజే పల్లవి కోసం.. ఆమె మేనమామ కొడుకు సందీప్ కత్తితో చేయి కోసుకున్నాడని అమరేందర్ చెబుతున్నాడు. సందీప్‌తో పల్లవి చనువుగా ఉండేది. ఈ విషయం అడిగినందుకే గొడవలు స్టార్ట్ అయ్యాయి అంటున్నాడు. పెద్దమనుషులు, బంధువులు ప్రలోభ పెట్టి రెండో పెళ్ళి చేసినట్లు చెబుతున్నాడు.

పల్లవి తరుపు వారి నుండి మాకు ప్రాణ హాని ఉందని అమరేందర్ తండ్రి మహేందర్ చెబుతున్నారు. మనవరాళ్ళు అంటే తమకు చాలా ఇష్టమని.. వారిని దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆస్తి కోసమే పల్లవి గొడవ చేస్తోందని చెబుతున్నారు మహేందర్. కాగా పల్లవి ఫిర్యాదు నేపథ్యంలో సరూర్‌నగర్ ఉమెన్స్ పీఎస్‌లో అమరేందర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే న్యాయపోరాటం చేస్తామని.. అంతిమంగా నిజమే గెలుస్తుందని చెప్పాడు అమరేందర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి