Country Club: హైదరాబాద్ కంట్రీ క్లబ్‌ హైఫై పబ్‌లో‌ లీలలు అన్నీ.. ఇన్నీ.. కావట.! అంతా మసక మసక చీకటేనట.!

|

Jul 18, 2021 | 6:46 AM

హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఎన్నో పబ్‌లు ఉన్నాయి. యువతను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లు.. స్కీమ్‌లు ఇస్తున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా..

Country Club: హైదరాబాద్ కంట్రీ క్లబ్‌ హైఫై పబ్‌లో‌ లీలలు అన్నీ.. ఇన్నీ.. కావట.! అంతా మసక మసక చీకటేనట.!
Pub
Follow us on

Hyderabad Country Club: హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఎన్నో పబ్‌లు ఉన్నాయి. యువతను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లు.. స్కీమ్‌లు ఇస్తున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఒకే ఒక పబ్ నిత్యం వివాదాలను మూటగట్టుకుంటోంది. ఇప్పటికే 12 కేసులు.. అయినా పబ్ తీరు మారలేదు. కట్ చేస్తే, హైదరాబాద్ కంట్రీ క్లబ్‌‌లో జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కావట.! బార్‌లో అమ్మాయిలతో డ్యాన్సులు, గేలతో పార్టీలు, ఓవర్ టైమ్ పబ్ నడపడమే కాకుండా.. పబ్ మాటున వ్యభిచారం కూడా నడుపుతున్నట్టు హైఫై పబ్ మీద ఆరోపణలు ఉన్నాయి.

గతంలో అనేక కేసులు, వివాదాల్లో కంట్రీ క్లబ్ పబ్ చిక్కుకుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా.. ఓవర్ టైమ్ పబ్ నడిపేవారు.. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు.. అంతేకాకుండా పబ్ కు వచ్చిన కస్టమర్లతో వ్యభిచారం చేయించేవారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన గతంలో కేసులు కూడా బుక్కయ్యాయి. 2008 నుంచి ఇప్పటి వరకు.. ఈ పబ్ మీద మొత్తం 12 వివాదాలు ఉన్నాయి.

తాజాగా మరో వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌ కంట్రీ క్లబ్ లోని హైఫై పబ్‌. తనతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి సీసీ పుటేజీ కావాలని ఓ యువతి కోరింది. అయితే సీసీ పుటేజీ ఇస్తే తమ పబ్‌ పరువుపోతుందంటూ.. ఫుటేజ్ ఇవ్వలేదు. పైగా ఆ అమ్మాయిపై పబ్‌ సిబ్బంది దాడికి దిగడం.. కొసమెరుపు. తన మీద జరిగిన దాడిపై పంజాగుట్ట పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్ నిర్వాహకుల కోసం గాలింపు చేపట్టారు. పబ్ ఓనర్ మురళీకృష్ణతో పాటు మేనేజర్ శేఖర్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పబ్ లో షేర్లు అమ్మేసిన.. మురళీ అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్నాడు.. ఘటన సమయంలో లేకపోయినా.. వేరే ప్రాంతం నుంచి వచ్చి మరీ దాడి చేశాడు.. ఆ అమ్మాయితో ఏమైనా పర్సనల్ తగాదాలు ఉన్నాయా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: YS Jagan: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల జాతర.. సామాజిక న్యాయానికి పెద్దపీట