Cyber Fraud Alert: సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త.. ఒకే రోజు ఆరు మోసాలు.. ఒక్కో క్రైమ్ ఒక్కో విధంలో..

|

Jan 06, 2022 | 1:41 PM

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పాండమిక్ పరిస్థితిని తమకు అనువుగా మార్చుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. రోజుకో కొత్త విధానంలో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.

Cyber Fraud Alert: సైబర్ నేరగాళ్లున్నారు జాగ్రత్త.. ఒకే రోజు ఆరు మోసాలు.. ఒక్కో  క్రైమ్ ఒక్కో విధంలో..
Follow us on

Cyber Crimes: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పాండమిక్ పరిస్థితిని తమకు అనువుగా మార్చుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. రోజుకో కొత్త విధానంలో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో ఒక్క రోజులో 6 సైబర్ మోసాలు నమోదుకావడం పరిస్థితికి అద్దంపడుతోంది. చైన్ లింక్ మోసం ఒకటైతే.. కేటీఆర్ మనిషినని బెదిరించి భారీ మోసం ఇంకోటి. ఇక లాటరీ పేరు చెప్పి లక్షలాది రూపాయల లూటీ మరో విధానం. ఇన్ స్టాగ్రామ్ ఫోటోల మార్ఫింగ్‌తో మరో వేధింపు ఇంకో రకం. అధిక లాభాల పేరిట మరో భారీ టోకరా. ఫైనల్‌గా సోలార్ పేనళ్లు అద్దెకిస్తామని ఇంకో బిగ్ ఫ్రాడ్ చోటు చేసుకుంది.

ఇవన్నీ ఒక్కరోజులో హైదరాబాద్, వికారాబాద్ కేంద్రంగా జరిగిన సైబర్ నేరాలు. ఒక్కో సైబర్ క్రైమ్ ఒక్కో విధంలో జరిగింది. వికారాబాద్‌లో చైన్ లింక్ ఫ్రాడ్ జరిగింది. కేవలం రూ.500 కట్టి.. అందుకు డబుల్ అంటే రూ.1000 పొందండి. మీ ఇష్టం ఐదు వందలే కట్టాలని లేదు. లక్ష రూపాయలను కూడా కట్టవచ్చు. అందుకు డబుల్ అంటే రూ.2 లక్షలు ఈజీగా ఇంటికి పట్టుకు పోవచ్చంటూ ఆశచూపి పలువురుని మోసగించారు.

మంత్రి కేటీఆర్ మనుషులమంటూ బెదిరించాడో సైబర్ నేరగాడు. లక్షలాది రూపాయలు లాగేశాడు. అదెలా సాధ్యం? అంటే ఇమ్యునో థెరఫీ మెడిసన్‌తో చికిత్స చేస్తామంటూ గోపాల్ నాయక్ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. పోస్టు ఎందుకు పెట్టావ్? నేను కేటీఆర్ మనిషిని కేశవుల్ని మాట్లాడుతున్నా అంటూ ఓ చీటర్ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో రూ.2.5 లక్షల వరకూ ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. మరో సారి కూడా డబ్బు పంపమని కేశవులు వేధించడంతో గోపాల్ నాయక్ సైబర్ క్రైమ్ కి వెళ్లి కంప్లయింట్ చేశాడు.

Cyber Crime

మీకు పాతిక లక్షల వరకూ లాటరీ వచ్చిందంటూ హైదరాబాద్ కి చెందిన హుస్సేన్ కు ఫోన్ వచ్చింది. అవునా? అయితే ఆ డబ్బులు నాకెలా వస్తాయని అడిగితే.. మీరు డాక్యుమెంట్ ఛార్జీలతో పాటు ఇన్ కమ్ ట్యాక్స్, జీఎస్టీ పే చేయాలని రిప్లై వచ్చింది. దీంతో అత్యాశపడ్డ హుస్సేన్ వాళ్లు చెప్పినట్టు రూ.6 లక్షలు కట్టాడు. కట్ చేస్తే.. సైబర్ చీటర్ ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో బాధితుడు హుస్సేన్ సైబర్ క్రైమ్ స్టేషన్ కి వచ్చి లబోదిబోమన్నాడు.

ఒక మహిళ ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలను అప్‌లోడ్ చేసేవారు. ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి- రీ అప్లోడ్ చేశారు అశ్విని, మురళి అనే ఇద్దరు. వీరిపై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితు మహిళ కంప్లయింట్ చేశారు.

ఈ పాండా వెబ్ సైట్ లో పెట్టుబడులు పెడితే…మీకు బోలెడు లాభాలని నమ్మించారు కొందరు సైబర్ చీటర్స్. ఇది చూసి టెంప్ట్ అయిన ఇద్దరు వ్యక్తులు 9 లక్షల రూపాయలను పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఇన్వెస్టర్ల నెంబర్లన్నిటినీ బ్లాక్ చేశారు. విషయం అర్ధం చేసుకున్న బాధితులు సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.

Cyber Crime

సోలార్ ప్యానెళ్లు అద్దెకు ఇస్తామంటూ హైదరాబాద్ లో మరో భారీ ఫ్రాడ్ జరిగింది. సుమారు 50 మంది నుంచి లక్షలాది రూపాయలను దండుకున్నారీ కేటుగాళ్లు. ఎల్జా ఎనర్జీ కంపెనీ పేరిట సోలార్ ప్యానెళ్లను అద్దెకిస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కంపెనీ ప్రకటనలకు టెంప్ట్ అయిన కొందరు వీళ్లను అప్రోచ్ అయ్యారు. కంపెనీలో పెట్టుబడులు పెడితే వారం రోజుల్లోనే పదింతల లాభాలొస్తాయని ఊదరగొట్టారు. దీంతో రెచ్చిపోయి పెట్టుబడులు పెట్టారు. ఈ మొత్తం 17 లక్షల రూపాయలు. వారం దాటాక కంపెనీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేక పోవడంతో.. చేసేది లేక సైబర్ క్రైమ్ కి కంప్లయింట్ చేశారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో ప్రజలను బురిడీకొట్టిస్తూనే ఉన్నారు. ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరి దగ్గరా అందినకాడికి దండుకుంటున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువ లాభల కోసం లాభపడితే అంతే సంగతలు. ఏదైనా ఎక్కువ లాభం వస్తుందంటే.. దాని వెనుక సైబర్ ఫ్రాండ్ ఉండే అవకాశముంది.  డబ్బు ఆశజూపుతూ వచ్చే లింక్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మొబైల్ ఫోన్స్‌లో వాడే యాప్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తవహించాలి.

Also Read..

WhatsApp UPI: వాట్సాప్‌లో యూపీఐ పిన్‌ ఎలా మార్చుకోవాలో తెలుసా.? ఈ సింపుల్‌ స్టెప్స్‌ ఫాలోవ్వండి..

PM Security Breach: ప్రధాని మోడీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఫోన్‌ కాల్.. పంజాబ్‌లో భద్రతా వైఫల్యాలపై ఆరా..