Hyderabad: గచ్చిబౌలి యాక్సిడెంట్‌లో చనిపోయిన గాయత్రి ఈమే అని మీకు తెలుసా..?

మార్చి 18న సాయంత్రం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ మార్గంలో జరిగిన యాక్సిడెంట్‌లో గాయత్రి దుర్మరణం చెందింది. ఆమె ఓల్డ్ వీడియోలు ప్రజంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Hyderabad: గచ్చిబౌలి యాక్సిడెంట్‌లో చనిపోయిన గాయత్రి ఈమే అని మీకు తెలుసా..?
Late Actress Gayatri
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2022 | 12:35 PM

లైఫ్‌లో నెక్ట్స్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేం. చావు ఎప్పుడైనా ముంచుకు రావొచ్చు. అది ఏ రూపంలోనైనా వెంటాడొచ్చు. అప్పటివరకు కళ్ల ముందు ఉన్నవారు.. క్షణాల్లో విగతజీవులుగా మారిపోతున్న వార్తలు వింటున్నాం. అలానే భవిష్యత్‌పై ఎన్నో కలలు పెట్టుకున్న యువ నటి గాయత్రి గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అశువులు బాసింది. మార్చి 18న సాయంత్రం గచ్చిబౌలి(Gachibowli )లోని ఎల్లా హోటల్ మార్గంలో జరిగిన యాక్సిడెంట్‌లో గాయత్రి దుర్మరణం చెందింది. KPHB కాలనీలో నివాసం ఉండే గాయత్రి…రోహిత్‌ అనే వ్యక్తికి స్నేహితురాలు. పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది గాయత్రి. యూ ట్యూబ్‌లో గాయత్రి షార్ట్‌ ఫిల్మ్‌లకు మంచి వ్యూస్ ఉన్నాయి. వీకెండ్‌ వచ్చినా…ఏదైనా పండుగొచ్చినా రోహిత్‌, గాయత్రి.. ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేవారు. అదే క్రమంలో మార్చి 18న హోలి పండుగ సందర్భంగా ఇద్దరూ కలిసి గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో హోలి ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడ  హోలీ(Holi) ఈవెంట్‌లో ఎంజాయ్‌ చేశారు. ఆ తర్వాత రోహిత్, గాయత్రి కారులో బయలుదేరారు. మత్తులో అతివేగంగా కారు నడుపుతూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టాడు రోహిత్. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే అక్కడి గార్డెన్‌లో పనిచేసే మహేశ్వరి అనే మహిళ చనిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయత్రి మృతి చెందింది. పక్కటెముకలు విరగడంతో రోహిత్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా గాయత్రికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. వీడియోలో ఆమెను ఓ వ్యక్తి ఫ్లట్ చేస్తూ కనిపించాడు. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ బాయ్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోను అందరూ చూస్తున్నారు కానీ.. అందులో ఉంది గాయత్రి అని చాలామందికి తెలియదు. ఏది ఏమైనా మద్యం మత్తు.. ఓ మంచి భవిష్యత్ ఉన్న నటి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేలా చేసింది.

(తాగి వాహనాలు నడపకండి. కోరి ప్రమాదాలను కొనితెచ్చుకోకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణలకు మాత్రమే కాదు ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు)

Also Read:  Viral Video: కొండ చిలువతో మజాక్ ఆడబోయిన సింహం పిల్ల.. పైథాన్ రిప్లై చూస్తే కంగుతింటారు

Telangana: పండింది.. మిర్చి కాదు గోల్డ్.. తులం బంగారం ధరను క్రాస్ చేసిన ఎర్ర బంగారం రేటు