Hyderabad: పాపం.. రోజూలానే పొద్దున్నే పనికెళ్లాడు.. 30వ అంతస్తులో పనిచేస్తుండగా పెద్ద శబ్ధం.. అందరూ చూడగా..

|

Oct 05, 2023 | 12:23 PM

అతను ఓ ఏసీ మెకానిక్.. పొట్టకూటి కోసం తాను పనిచేసే ప్రాంతానికి ఉదయాన్నే వెళ్లాడు.. రోజూ లానే తన పనిని ప్రారంభించాడు.. ఓ పెద్ద భవనంలో 30వ అంతస్తు పైన పనిచేస్తుండగా.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. బిల్డింగ్ పై నుంచి పడి అక్కడికక్కడే మరణించాడు.. దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Hyderabad: పాపం.. రోజూలానే పొద్దున్నే పనికెళ్లాడు.. 30వ అంతస్తులో పనిచేస్తుండగా పెద్ద శబ్ధం.. అందరూ చూడగా..
Crime News
Follow us on

హైదరాబాద్, అక్టోబర్ 05: అతను ఓ ఏసీ మెకానిక్.. పొట్టకూటి కోసం తాను పనిచేసే ప్రాంతానికి ఉదయాన్నే వెళ్లాడు.. రోజూ లానే తన పనిని ప్రారంభించాడు.. ఓ పెద్ద భవనంలో 30వ అంతస్తు పైన పనిచేస్తుండగా.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. బిల్డింగ్ పై నుంచి పడి అక్కడికక్కడే మరణించాడు.. దీంతో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ భవనంలో 30వ అంతస్తులో పనిచేస్తున్న ఏసీ మెకానిక్‌ ప్రమాదవశాత్తు కిందపడి మరణించిన ఘటన నార్సింగిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందిన అడపా వెంకట భీమేష్‌ (35) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని బోరబండ రాజ్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నార్సింగి గిరిగిరి గడ్డ సమీపంలోని రాజపుష్ఫ అనే నిర్మాణ సంస్థలో ఏసీ వర్కర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో భీమేష్ రోజూలానే బుధవారం పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భవనం 30వ అంతస్తులో ఏసీ పైపులు బిగిస్తున్నాడు. ఈ క్రమంలో భీమేష్.. పనిచేస్తూ ప్రమాదవశాత్తు జారి 4వ అంతస్తు బేస్‌మెంట్‌పై ఒక్కసారిగా పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో భీమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన భవన నిర్మాణ కూలీలు భీమేష్ కుటుంబానికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.

కాగా.. భీమేష్‌ మృతిపై భార్య జ్యోత్స్నాదేవి కన్నీరుమున్నీరుగా విలపించింది. పని ప్రదేశంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భర్త మరణించాడంటూ ఆరోపించింది. ఈ మేరకు భీమేష్‌ భార్య జ్యోత్స్నాదేవి.. నార్సింగి పోలీసులకు పిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నార్సంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమేష్ ప్రమాదవశాత్తు మరణించాడా..? లేక మరేదైనా కుట్ర ఉందా..? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..