హైదరాబాద్ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని కనిపెట్టారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలీసులు గుర్తించారు.. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికను అబిడ్స్‌కు తీసుకొచ్చారు.. అంనతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ కనిపించగానే బాలిక బంధువులు అతడిపై దాడికి దిగారు.
చాక్లెట్ ఇస్తానని చెప్పి అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలికను కిడ్నాప్ చేశాడు దుండగుడు. కట్టెలమండిలో నానమ్మ ఇంటికి వచ్చిన బాలిక ప్రగతిని ఇంటి ముందు ఆడుకుంటుండగా ఏమార్చాడు దుండగుడు… దూరంలో పార్క్ చేసి ఉన్న ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
ప్రగతి కనిపించకపోవడంతో బాలిక మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే శోధించారు. చివరకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర గుర్తించారు. కిడ్నాపర్‌ను అరెస్టుచేసి వివరాలు సేకరిస్తున్నామని.. పోలీసులు తెలిపారు.
పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు బాలిక బంధువులు. కంప్లైంట్ చేసిన వెంటనే స్పందించి… తమ పాపను కాపాడారని థ్యాంక్స్ చెప్పారు
కిడ్నాపర్‌ను బిహార్‌కి చెందిన మహహ్మద్ బిలాల్‌గా గుర్తించారు పోలీసులు. ఇతనికి గతంలోనే నేర చరిత్ర ఉందని.. పిల్లలను కిడ్నాప్‌చేసి బిహార్‌లో విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. దాంతో, కిడ్నాపర్ వెనుక ముఠా ఏదైనా ఉందా? ఇప్పటివరకు ఎంతమందిని కిడ్నాప్ చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..