ప్రాణం విలువ అంటే ఏంటో చెప్పే సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దీపాల కాంతులతో నిన్న దీపావళి సంతోషంగా జరుపుకున్న వేళ.. ఈ ఘటన ఈ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. నాంపల్లిలోని కెమికల్స్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని స్టోరేజీ గోడౌన్‌ను చుట్టుముట్టిన మంటల్లో ఒక చిన్నారితోపాటూ మహిళ చిక్కుకున్నారు. వీరిని హైదరాబాద్‌లోని అగ్నిమాపక సిబ్బంది అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించి కాపాడగలిగారు. తీవ్రమైన మంటలు చుట్టుపక్కల నివసించే వారికి అనుకోని ప్రమాదాన్ని మిగిల్చింది. రాకాశి అగ్నికీలలు నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న డీజల్ స్టోరేజీ గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
రగులుతున్న మంటల మధ్య, రెస్క్యూ టీమ్ అసాధారణమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. ఈ మంటల్లో, దట్టమైన పొగలో చిక్కుకున్న ఒక మహిళను, చిన్నారిని కిడికీలో నుంచి నిచ్చన వేసి బయటకు తీశారు. దీంతో ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగారు అధికారులు. కొన్ని ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. నిండు ప్రాణాలను కాపాడగలిగారు. మంటల్లో చిక్కుకున్న వారి ధైర్యసాహసాలను చూసి ప్రతి ఒక్కరూ ఔరా అనాల్సిందే. అందులోనూ లోకజ్ఞానం తెలియని పసికందు ఏడుపులు ఒకవైపు, ప్రాణ భయం మరో వైపు. ఇంతటి పెను ప్రమాదం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు ఇద్దరు.
ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మహ్మద్ ఆజమ్, మహ్మద్ హసీబుర్, రెహమాన్, రెహానా సుల్తానా, తహూరా ఫర్హీన్, తూభ, తరూబా ఉన్నారు. ఇందులో తహూరా ఫర్హీన్ డెంటల్ డాక్టర్ కాగా మిగిలిన ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఒక అవివాహిత కూడా కాలి బూడిదైన పరిస్థితి. ఈ అమానవీయమైన ఘటనపై ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ పశ్చాతాపం పడుతున్నారు. సాధారణంగా వీళ్లు ఇక్కడ నివసించరు. దీపావళి పండుగ, వారాంతపు సెలవులు కావడంతో నాంపల్లిలోని ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకూ 21 మందిని ఆసుపత్రికి తరలించగా 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో మొదటి, రెండు ఫ్లోర్లలో ఉన్నవారే ఎక్కువగా గుర్తించారు. బిల్డింగ్ యాజమాని రమేష్ జైస్వాల్‌కు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ సంఘటనా స్థలానికి మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన ఒక్కొక్కరికీ ప్రభుత్వం తరఫున రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) అందిస్తామన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై దర్యాప్తు వేగవంతం చేసి చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.
#WATCH | Daring rescue of a child and woman amid massive fire in a storage godown located in an apartment complex in Bazarghat, Nampally of Hyderabad pic.twitter.com/Z2F1JAL8wa
— ANI (@ANI) November 13, 2023
మరిన్ని తెలంగాాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..