సింహానికి పక్షవాతం … జూలో మరణం

|

Jul 21, 2019 | 12:35 PM

హైదరాబాద్ జూలో అయిదేళ్ల సింహానికి పక్షవాతం (పెరాలిసిస్) సోకింది. గత జులై 8 నుంచి ఇది సరిగా నిలబడలేకపోవడంతో.. వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు. కానీ అవి ఫలించక శనివారం మరణించింది. ‘ జీతూ ‘ అనే ఈ సింహానికి జూపార్కులోని సమ్మర్ హౌస్ లో గల ఇంటెన్సివ్ కేర్ లో అన్ని ట్రీట్ మెంట్లూ ఇచ్చారు. పశువైద్య నిపుణులు కూడా వచ్చి పరీక్షించి మందులు ఇచ్చ్చారని, అయినా ఫలితం లేకపోయిందని జూ వర్గాలు తెలిపాయి. పోస్ట్ […]

సింహానికి పక్షవాతం ... జూలో మరణం
Follow us on

హైదరాబాద్ జూలో అయిదేళ్ల సింహానికి పక్షవాతం (పెరాలిసిస్) సోకింది. గత జులై 8 నుంచి ఇది సరిగా నిలబడలేకపోవడంతో.. వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు. కానీ అవి ఫలించక శనివారం మరణించింది. ‘ జీతూ ‘ అనే ఈ సింహానికి జూపార్కులోని సమ్మర్ హౌస్ లో గల ఇంటెన్సివ్ కేర్ లో అన్ని ట్రీట్ మెంట్లూ ఇచ్చారు. పశువైద్య నిపుణులు కూడా వచ్చి పరీక్షించి మందులు ఇచ్చ్చారని, అయినా ఫలితం లేకపోయిందని జూ వర్గాలు తెలిపాయి. పోస్ట్ మార్టం నిర్వహించగా.. సింహంలోని అవయవాలు పని చేయలేదని, ముఖ్యంగా వెనుక కాళ్ళు చచ్ఛు పడినట్టు గుర్తించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. శాంపిల్స్ ను సేకరించి వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు పంపామని జూ అధికారులు వెల్లడించారు. క్రూరమృగాలకు ఈ విధమైన ప్రాణాంతక రుగ్మతలు సోకడం అరుదని భావిస్తున్నారు. ఏషియాటిక్ సింహాలైన అతుల్, జ్యోతిలకు ఈ లయన్ 2014 లో పుట్టింది.