
హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. దసరా సెలబ్రేషన్స్ టార్గెట్‌గా హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు చేసిన ప్లాన్‌ను చేధించారు. ప్రధాన కుట్రదారు జాహిద్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. నిఘా వర్గాల ఇన్ఫర్మేషన్‌తో అర్ధరాత్రి దాడులుచేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూసారంబాగ్‌లో ఉంటోన్న ప్రధాన కుట్రదారు జాహిద్ ఇంటి నుంచి నాలుగు గ్రెనేడ్స్‌తోపాటు పేలుడు సామగ్రి, రూ.5.41లక్షల క్యాష్‌ని స్వాధీనం చేసుకుంది సిట్. ఈ గ్రెనేడ్స్‌ను పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్స్ నుంచి అందుకున్నాడు జాహిద్. పలు టెర్రర్ గ్రూప్స్‌తో లింకులున్న జాహిద్… పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు గుర్తించింది సిట్. హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించాలని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని ఐఎస్‌ఐ నుంచి ఆదేశాలు అందుకున్న జాహిద్, ఈ దసరా సెలబ్రేషన్స్ లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు ఇంటరాగేషన్‌లో తేల్చింది సిట్. బాంబు పేలుళ్లతోపాటు RSS, BJP లీడర్స్‌ను అంతమొందించేందుకు, మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేసినట్టు గుర్తించారు.
ప్రధాన కుట్రదారు జాహిద్, పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 2002లో దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా టెంపుల్ బ్లాస్ట్ కేసులో… 2004లో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ బ్లాస్ట్ కుట్ర కేసులో… 2005లో బేగంపేట్ టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌పై సూసైడ్ అటాక్ ప్లాన్ కేసులో అక్యూజ్డ్‌గా ఉన్నాడు జాహిద్. అలాగే, మక్కా మసీద్ బ్లాస్ట్ కేసులోనూ గతంలో జాహిద్‌ను ఇంటరాగేట్ చేశారు పోలీసులు.
Police arrested 3 people identified as Abdul Zahed, Mohd Sameeuddin & Maaz Hasan Farooq for conspiring to hurl grenades at public gatherings.Abdul Zahed was previously involved in several terror-related cases &was in regular touch with Pakistani ISI-LeT handlers: Hyderabad Police pic.twitter.com/CW5GkIbbod
— ANI (@ANI) October 2, 2022
లేటెస్ట్‌గా ఉగ్ర దాడుల కోసం టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు జాహిద్. అందుకోసం ఉగ్రభావాలున్న యువకులను రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆరుగురిని తన టీమ్‌కి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం మెయిన్ అక్యూజ్డ్ జాహిద్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల వెర్షన్ ఇలాగుంటే, అసలు తమ పిల్లలకు ఉగ్రసంస్థలతో లింకులే లేవంటున్నారు పేరెంట్స్.
మరిన్నితెలంగాణ వార్తల కోసం