Hyderabad: రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో సంచలన ట్విస్ట్.. కారణం అదేనా..?

|

Aug 13, 2024 | 8:51 AM

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ రౌడీషీటర్‌ రియాజ్‌ మర్డర్‌ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియాజ్ హత్య ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే రియాజ్‌‌ను టార్గెట్ చేసిందెవరు..? రియాజ్‌ను చంపింది ఎవరు?

Hyderabad: రౌడీషీటర్ రియాజ్ హత్య కేసులో సంచలన ట్విస్ట్.. కారణం అదేనా..?
Rowdy Sheeter Riaz
Follow us on

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ రౌడీషీటర్‌ రియాజ్‌ మర్డర్‌ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రియాజ్ హత్య ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే రియాజ్‌‌ను టార్గెట్ చేసిందెవరు..? రియాజ్‌ను చంపింది ఎవరు?.. అనే అంశాలపై దృష్టి సారించిన పోలీసులు దర్యాప్తు చేశారు. త్వరలో కేసును కొన్ని రోజుల్లో ఛేదించారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో ఐదు రోజులు క్రితం జరిగిన రౌడీ షీటర్‌ రియాజ్‌ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. అయితే.. అనూహ్యంగా రియాజ్ హత్యకు స్వలింగ సంపర్కమే కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. 14 ఏళ్ల బాలుడిపై ఇటీవల రియాజ్ అండ్‌ కో అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. దాంతో.. రియాజ్ హత్యకు బాలుడి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తక్కువ సమయంలోనే కేసు ఛేదించారు.

పది బృందాలుగా విడిపోయి ఎంక్వరీ చేసిన పోలీసులు.. వందలాది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే.. చిన్న క్లూ దొరకండంతో ఆ దిశగా దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. రియాజ్ హత్యకు పాత కక్షలే కారణమని తేల్చారు. రియాజ్‌ను సలీం అండ్‌ సుల్తాన్ అనే గ్యాంగ్ పక్కాగా ప్లాన్ చేసి కాల్చి చంపినట్లు గుర్తించారు. హత్య కేసులో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌లో ఉన్న గౌస్‌ అనే బీహార్‌ వ్యక్తి.. తపంచతో రియాజ్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. రియాజ్‌పై కాల్పులు జరిపి, సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ పారిపోయింది. రియాజ్ హత్య గురించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు.

ఎంక్వైరీలో కీలక విషయాలు తెలియగా.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హమీద్ కుమారుడిపై స్వలింగ సంపర్కానికి పాల్పడడమే రియాజ్ హత్యకు దారి తీసిందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. నెల రోజుల క్రితం గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్‌తో సుఫారి హత్యకు డీల్‌ కుదుర్చుకుని.. రియాజ్‌ను చంపేయాలని చెప్పి.. ఆ తర్వాత దుబాయ్ వెళ్లిపోయింది బాలుడి ఫ్యామిలీ. రియాజ్ కోసం సలీమ్ అండ్ సుల్తాన్ గ్యాంగ్ నెల రోజుల నుంచి ఎదురు చూసి.. అదను చిక్కడంతో హతమార్చింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..