Hyderabad: మిస్సింగ్ భార్గవి సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. ఇంతకీ ఆమె ఎక్కడికెళ్లిందంటే..

|

Nov 14, 2021 | 7:37 AM

Hyderabad: హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆమె ఎక్కడుందో పోలీసులు కనిపెట్టారు. ఆపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Hyderabad: మిస్సింగ్ భార్గవి సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు.. ఇంతకీ ఆమె ఎక్కడికెళ్లిందంటే..
Bhargavi
Follow us on

Hyderabad: హైదరాబాద్ దోమలగూడలో నవ వధువు భార్గవి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆమె ఎక్కడుందో పోలీసులు కనిపెట్టారు. ఆపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దోమలగూడకు చెందిన నవ వధువు భార్గవి ఈనె 10వ తేదీన సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్గవి.. ఎంతకూ తిరిగి రాలేదు. పైగా తన ఫోన్‌ను కూడా రోడ్డుపై పడేంది. దాంతో ఫోన్ స్విచ్ఛావ్ రావడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్గవి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు.

భార్గవి మిస్సింగ్ కేసు పోలీసులను ముచ్చెమటలు పట్టించింది. భార్గవి ఆచూకీ కోసం.. 200 సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ ఫోన్‌ను కూడా పడేయంతో పోలీసులకు మరింత క్లిష్టంగా మారింది. చివరికి ఆమె ఎక్కడికి వెళ్లిందనేది కనిపెట్టారు పోలీసులు. భార్గవి తిరుపతికి వెళ్లిందని గుర్తించిన పోలీసులు.. అక్కడ తన తండ్రి ఇంటికి చేరుకుందన్న విషయాన్ని తెలుసుకున్నారు. భార్గవి తిరుపతికి వెళ్లిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. భార్గవి క్షేమ సమాచారంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Also read:

T20 World Cup 2021: అద్భుతమైన ఫామ్‎లో ఉన్న ఆడమ్ జంపా.. ఫైనల్‎లో కూడా రాణిస్తాడా..

Corona Vaccination: వారికి టీకాలు వేయడం కోసం ఇంటింటికీ వైద్యబృందాలను పంపుతాం.. సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

Silver Price Today: షాకిస్తున్న వెండి ధరలు.. బంగారం బాటలోనే సిల్వర్.. ఎంత పెరిగాయంటే..