New Fraud: బెట్ ఇన్‌ ఎక్స్చేంజ్ పేరుతో నయా మోసాలు.. అలర్ట్‌గా ఉండాలంటూ పోలీసుల వార్నింగ్..

|

Jun 22, 2021 | 3:49 PM

New Fraud: బెట్‌ ఇన్ ఎక్స్చేంజ్ పేరుతో రాష్ట్రంలో నయా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మోసాలను గుర్తించిన పోలీసులు.. ప్రజలను అలర్ట్ చేశారు.

New Fraud: బెట్ ఇన్‌ ఎక్స్చేంజ్ పేరుతో నయా మోసాలు.. అలర్ట్‌గా ఉండాలంటూ పోలీసుల వార్నింగ్..
Bet In Exchange
Follow us on

New Fraud: బెట్‌ ఇన్ ఎక్స్చేంజ్ పేరుతో రాష్ట్రంలో నయా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ మోసాలను గుర్తించిన పోలీసులు.. ప్రజలను అలర్ట్ చేశారు. లైవ్ టెలికాస్టింగ్‌తో జనాలను నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్లు. వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి అందినకాడికి దోచేసుకుంటున్నారు. టీన్ పత్తి, అందర్ బహార్, కెసినో, స్నూకర్, క్రికెట్ తో పాటు నిషేధిత బెట్టింగ్ వ్యవహారాలన్నింటినీ ఒకే వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసి గేమ్స్ నిర్వహిస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులకు పట్టుబడకుండా.. పోలాండ్, హాలండ్, గోవా, ముంబై క్లబుల నుంచి లైవ్ ప్యాడింగ్ నిర్వహిస్తున్నారు. ఈ వెబ్‌సైట్‌ల ద్వారా రూపాయి నుంచి కోటి రూపాయల వరకు బెట్టింగ్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్ ద్వారా కమ్యూనికేషన్లు నిర్వహిస్తున్నారు ఈ మాయగాళ్లు. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయిస్‌ని టార్గెట్‌గా చేసుకుని ఈ బెట్ ఇన్‌ ఎక్స్చేంజ్‌లను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ లక్షల రూపాయలు కెసినో లో పెట్టి మోసపోయినట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బాధిత టెకీ రూ. 10 లక్షలు పెట్టి కెసినో లో గెలిచాడు. బెట్టింగ్ ప్రకారం అతనికి కోటి రూపాయలు రావాల్సి ఉంది. అయితే, ఎదరుచూస్తూ ఉండిపోయాడు. చివరికి బెట్ ఇన్‌ ఎక్స్చేంజి నిర్వాహకులను ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని ఆన్సర్ వచ్చింది. దాంతో షాక్ అవడం అతని వంతైంది. కాగా, బెట్టింగ్‌పై తెలంగాణలో పూర్తిస్థాయి నిషేధాజ్ఞలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోసగాళ్లు కొత్త దారిలో చీటింగ్‌కు పాల్పడుతున్నారు. ఎక్కడో ఉండి వెబ్‌సైట్లు, ఇతర సీక్రేట్ మార్గాల ద్వారా బెట్టింగ్‌లు నిర్వహిస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. లైవ్ పాడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Also read:

Tadepalli Gang Rape Case: యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..