Triple Talaq: హైదరాబాద్ పాత బస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు.. ఈ మహిళ స్టోరీ కొంత డిఫ్రెంట్..

Triple Talaq in Hyderabad: హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ విడాకులు చర్చనీయ అంశంగా మారింది. ఫోన్‌లోనే మూడుసార్లు తలాక్ చెప్పి వివాహ బంధాన్ని తెంచుకున్నాడు భర్త. ఇకపై మనం కలిసి ఉండలేం.. నీకు విడాకులు ఇస్తున్నానంటూ మూడు సార్లు తలాక్‌ చెప్పాడు. ముస్లిం సంప్రదాయం ప్రకారం నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పడంతో భార్య ఫాతిమా నివ్వెరపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. భర్తను సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు సౌత్‌వెస్ట్‌ మహిళా పోలీసులు.

Triple Talaq: హైదరాబాద్ పాత బస్తీలో మరో ట్రిపుల్ తలాక్ కేసు.. ఈ మహిళ స్టోరీ కొంత డిఫ్రెంట్..
Triple Talaq

Edited By: Sanjay Kasula

Updated on: Aug 02, 2023 | 6:55 AM

అతనో ట్యూటర్‌. బాగా చదువుకున్నాడు. కూతురును అంతే బాగా చూసుకుంటాడని నమ్మారు యువతి తల్లిదండ్రులు. గొప్ప సంబంధం పోతే దొరకదని భావించారు. 2020లో తాహతుకు మించి 15 లక్షల కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లిచేశారు. ఆర్నెళ్లపాటు అన్యోన్యంగా కాపురం చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అంతలోనే విధి వక్రీకరించింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన భర్త అఫ్రోజ్‌ అనారోగ్యం పాలయ్యాడు. భర్త బాగోగులు చూస్తూ కంటికి రెప్పలా చూసుకుంది భార్య అతియా ఫాతీమా.ఇవేమీ తెలియని అఫ్రోజ్‌ తల్లి.. పిల్లలు పుట్టడం లేదంటూ కోడలిని దెప్పిపొడవడం మొదలు పెట్టింది. అయినా మౌనంగా సహించింది ఫాతీమా. తన భర్త అనారోగ్యం గురించి అత్తకేకాదు.. పుట్టింటివారికి కూడా చెప్పలేదు.

తనలో తానే బాధపడుతూ భర్తకు సపర్యలు చేస్తూ వస్తోంది. క్రమంగా అత్త వేధింపుల డోసు పెంచడంతో భరించలేకపోయింది. వేధింపులను ఏడాదిపాటు భరించిన ఫాతీమా.. ఇక ఇంట్లో ఉండలేక పుట్టింటికి వెళ్లింది. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. తన నెలసరి జీతాన్ని కూడా వాడుకున్న భర్త అఫ్రోజ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది.ఓ రోజు భార్య ఫాతీమాకు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ చేయడంతోనే ఇకపై మనం కలిసి ఉండలేం.. నీకు విడాకులు ఇస్తున్నానంటూ టపీటపీమని.. మూడు సార్లు తలాక్‌ చెప్పాడు.

ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇక నీకు, నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పడంతో భార్య ఫాతీమా నివ్వెరపోయింది. ఏం చేయాలో అర్థంకాలేదు. భర్తను సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడతో పోలీసులను ఆశ్రయించింది. అకారణంగా తనకు ట్రిఫుల్‌ తలాక్‌ చెప్పాడని కన్నీటిపర్యతమైంది. కేసు నమోదు చేసుకున్న సౌత్‌వెస్ట్‌ మహిళా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం