Hyderabad: పాతబస్తీ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మెట్రో రైలు పనులకు ఆ రోజే ముహూర్తం

|

Mar 04, 2024 | 7:22 PM

పాతబస్తీలో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మెట్రో పనులకు మార్చి 8న సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5.కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. పూర్తి వివరాలు తెలుసకుందాం పదండి...

Hyderabad: పాతబస్తీ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. మెట్రో రైలు పనులకు ఆ రోజే ముహూర్తం
CM Revanth Reddy
Follow us on

పాతబస్తీ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓల్డ్ సిటీ ప్రజల మెట్రో కళ నెలవేరబోతుంది. పాతబస్తీ మెట్రో రైలు నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 8న మెట్రో రైలు పనులకు రెండో దశ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. 8న పాతబస్తీలో రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5.కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలుపెట్టనున్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌నుమా మధ్య నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్‌ అందుబాటులోకి రాబోతోంది.

రెండో దశలో మొత్తం 70 కి.మీ. కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూట్‌మ్యాప్‌లను ఖరారు చేసింది. అందులో భాగంగా 5.5 కి.మీ మార్గానికి ఈ నెల 8న సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మించే 5.5 కి.మీ. అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా నేరుగా ఫలక్‌నుమాకు చేరుకోవచ్చు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాతబస్తీ మెట్రో మార్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఖరారు చేసిన డీపీఆర్‌ను రద్దు చేసి, పలు మార్పులు చేసి కొత్త రూట్ మ్యాప్‌ను ఖరారు చేశారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న ఈ మెట్రో మార్గం నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి 2012లోనే ప్రణాళికలు సిద్ధం చేసారు. కానీ, భూ సేకరణ, రోడ్డు విస్తరణ పనులు, నిర్మాణాల కూల్చివేత, ఇతర న్యాయ సంబంధిత కారణాల వల్ల ఈ మెట్రో నిర్మాణాన్ని ఎంజీబీఎస్‌ వరకే ఆపేశారు. ఎల్‌బీ నగర్ – నాగోల్ మధ్య మెట్రో మార్గం నిర్మాణాన్ని పూర్తి చేసి.. నాగోల్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..