Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్‌.. ఈ మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

|

Oct 02, 2022 | 7:29 PM

తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని...

Telangana: తెలంగాణ వాసులకు అలర్ట్‌.. ఈ మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Rain Alert In Telangana
Follow us on

తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతవారణ శాఖ వివరించింది. ఈ కారణంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంట్లో తెలంగాణలోని 440 మండలాల్లో వాతావరణం పొడిగా ఉందని అధికారులు తెలిపారు. ఇక 10 మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, పలుచోట్ల చిరు జల్లులు కురిశాయని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్​బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్​నగర్, నారాయణ గూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పండుగ నేపథ్యంలో జిల్లాలకు బస్సులు పెద్ద ఎత్తున వెళుతుండడం కూడా ట్రాఫిక్‌ అంతరాయానికి కారణంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..