Telangana: ‘హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం’.. వరంగల్‌ నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌

|

Apr 15, 2023 | 9:10 PM

హైదరాబాద్‌లో నిరుద్యోగులతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ శనివారం.. ఓరుగల్లులో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ ముగింపు సందర్భంగా బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కాకతీయ...

Telangana: హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తాం.. వరంగల్‌ నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌
Bandi Sanjay
Follow us on

హైదరాబాద్‌లో నిరుద్యోగులతో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షా పత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ శనివారం.. ఓరుగల్లులో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌ ముగింపు సందర్భంగా బండి సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రధాన రహదారి బీజేపీ శ్రేణులతో కాషాయసంద్రంగా మారింది. నిరుద్యోగ మార్చ్‌లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మేల్యే ఈటల, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్‌ సహా పలువురు బీజేపీ ర్యాలీలో పాల్గొన్నారు.

బహిరంగ సభలో బండి సంజయ్ బీఆర్‌ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పేపర్ల లీకులకూ బండి సంజేయే కారణమని చెబుతున్నారని, ప్రజల సమక్షంలో కేసీఆర్‌ సమాధానం చెప్పక తప్పదన్నారు. టీఎస్‌పీఎస్సీ తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మార్చ్‌ ఇంతటితో ఆగదని, త్వరలో ఖమ్మం , పాలమూరు సహా 10 ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహిస్తామని, తరువాత హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామన్నారు బండి సంజయ్‌.

అంతకు ముందు ఇదే వేదికగా బీఆర్‌స్‌ నేతలే టార్గెట్‌గా ఈటల రాజేందర్‌ విమర్శలు గుప్పించారు. మరో ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలిసిపోతుందన్నారు. బీజేపీ కేసులకు, దెబ్బలకు భయపడదని, తెలంగాణలో త్వరలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..