Hyderabad: జిమ్‌కి వెళ్లి వస్తున్న యువకుడిపై పెప్పర్ స్ప్రే కొట్టిన అగంతకులు.. కట్ చేస్తే సైరన్ల మోత.. అసలేం జరగిందంటే..

| Edited By: Shiva Prajapati

Aug 30, 2023 | 12:14 PM

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్ కాంతారెడ్డి నగర్‌లో రాహుల్ సింగ్ (25) యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను అత్తాపూర్ నుండి సెలబ్రిటీ జిమ్‌లో జిమ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పార్కింగ్ సెల్లార్లో ముగ్గురు ఆగంతకులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో రాహుల్ పై పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో సంఘటన స్థలంలోనే రాహుల్ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Hyderabad: జిమ్‌కి వెళ్లి వస్తున్న యువకుడిపై పెప్పర్ స్ప్రే కొట్టిన అగంతకులు.. కట్ చేస్తే సైరన్ల మోత.. అసలేం జరగిందంటే..
Hyderabad Murder
Follow us on

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్ కాంతారెడ్డి నగర్‌లో రాహుల్ సింగ్ (25) యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతను అత్తాపూర్ నుండి సెలబ్రిటీ జిమ్‌లో జిమ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో పార్కింగ్ సెల్లార్లో ముగ్గురు ఆగంతకులు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి సమయంలో రాహుల్ పై పెప్పర్ స్ప్రే కొట్టి కత్తులతో దాడికి తెగబడ్డారు. దీంతో సంఘటన స్థలంలోనే రాహుల్ కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు.

సంఘటన స్థలానికి చేరుకున్న డిసిపి జగదీశ్వర్ రెడ్డి..

ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి హత్య జరిగిన స్పాట్‌కి చేరుకున్నారు. రాహుల్ సింగ్ అనే వ్యక్తి పురాణాపూల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను మణికొండ ప్రాంతంలోని పుప్పాలగూడలో నివాసం ఉంటున్నాడని తెలిసింది. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తొందరలోనే నిందితులని పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

హత్యపై అనేక అనుమానాలు..

రాహుల్ సింగ్ గతంలో ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయితో రెండు నెలలు క్రితం ఎంగేజ్మెంట్ జరిగిందని, ముందు ప్రేమించిన అమ్మాయి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ గొడవ నడుస్తోంది. ఆ కోణంలో కూడా హత్య జరిగిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మణికొండ ప్రాంతంలోని స్థల వివాదంలో రాహుల్ సింగ్, ఇతర వ్యక్తులకు గొడవలు జరుగుతున్నాయని, ఆ కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హత్య ఉదాంతం స్థానికంగా కలకలం రేపింది. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసును త్వరగా తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..