
బోండా తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్ ఎస్.పి.ఆర్ హిల్స్‌లో నివాసం ఉంటున్న దాసరి రమేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ గురువారం విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో యూసఫ్‌గూడలోని ఓ టిఫన్ సెంటర్ వద్ద టిఫిన్ చేసేందుకు ఆగాడు.
బోండా ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆర్డర్ వచ్చాక అక్కడే పక్కన కుర్చీపై కూర్చొని తింటున్నాడు. ఇంతలో బోండా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టమయింది. స్థానికులు గమనించేలోపే అతను ఊపిరాడక అక్కకిక్కడే పడిపోయాడు. అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు రమేష్‌ను పరిశీలించారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్టు నిర్ధారించుకున్నారు.
ఇక రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిఫిన్ చేద్దామని వెళ్లిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.