Hyderabad: చాయ్ మరింత ప్రియం.. ఇలా అయితే ఎలా అంటున్న టీ లవర్స్

| Edited By: Ram Naramaneni

Aug 12, 2024 | 1:05 PM

స్నేహితులు నలుగురు కలిసి సరదాగా వెళ్లి బయటకు వెళ్తే... చాయ్ తాగాల్సిందే. ఉదయం, సాయంత్రం పూటల్లో ఖచ్చితంగా టీ తాగడం దినచర్యలో ఒక భాగంగా తయారైంది. ఇలా సామాన్య ప్రజలకు చాయ్ అనేది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. అయితే.. ఇప్పుడు ఉన్నట్లుండి టీ రేట్లు పెరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎంతో మంది చాయ్‌ ప్రియులు.

Hyderabad: చాయ్ మరింత ప్రియం.. ఇలా అయితే ఎలా అంటున్న టీ లవర్స్
Chai
Follow us on

మనలో చాలా మందికి పొద్దున్న లేచిందే ఆలస్యం.. కడుపులో టీ పడాల్సిందే. చాయ్ తాగకపోతే రోజంతా ఏదోలా ఉంటుందని చెప్పేవారు కూడా ఎంతో మంది. పొద్దున్న లేచి చాయ్ తాగాకే మిగతా ఏ పనులైనా మొదలెడతారు చాలామంది. చాయ్ నిజంగా ఓ వీక్‌నెస్, వ్యసనం అని చెప్పొచ్చు. ఒక పూట అన్నం లేకపోయినా సరే కానీ, చాయ్ తాగకపోతే ఉండలేం అనేవాళ్లు కూడా ప్రజంట్ సొసైటీలో ఉన్నారు.అలాంటి చాయ్ ప్రియులకు ఇప్పుడు ఒక చేదువార్త. చాయ్‌, ఇరానీ చాయ్‌ రేట్లు అమాంతం పెంచేశారు వ్యాపారులు. ఏకంగా ఒకేసారి టీపై రూ.5 అదనంగా వసూలు చేస్తున్నారు. రోజూలానే అలా బయటకు వచ్చి.. టీ తాగి.. డబ్బు పే చేపేటప్పుడు ఎక్కువ రేటు చెప్పడంటో.. చాలామంది ఖంగుతింటున్నారు.

ఇదేంటిది ఇలా అమాంతం రూ.5 పెంచేస్తే ఎలా అడిగితే.. టీ స్టాల్స్ నిర్వాహకులు తమ బాధలు చెబుతున్నారు. పాలు, చాయ్ పౌడర్, చక్కెర లేబర్ చార్జెస్ పెరగడంతో టీ రేట్లు పెంచామని అంటున్నారు. వారి వెర్షన్ ఆలోచిస్తే అది కూడా నిజమే కదా. మనకు చాయ్ అంటే ఒక ఇష్టమేమో.. వదులుకోలేని వ్యసనం ఏమో.. కానీ, వ్యాపారులకు అది ఒక ఆదాయం. ఈ వ్యాపారాన్నే నమ్ముకుని బతుకుబండి లాగుతున్న సామాన్యులు ఎంతోమంది హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా మందే కనిపిస్తారు. మరి పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్లు కూడా చాయ్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి కదా. ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఇరానీ చాయ్‌కి చాలా ఫేమస్. దేశంలో ఎక్కడా దొరకనంత రుచిగా ఇరానీ చాయ్ హైదరాబాద్ నగరంలో లభిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఇరాన్ చాయ్ తాగాలంటే రూ.25 రూపాయలు పెట్టాల్సిందే.  ఏది ఏమైనా ధర పెంపు.. చాయ్ ప్రియుల మనసును బాధ పెట్టే విషయమే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.